గుంటూరు

మండల స్థాయిలో విద్యార్థులకు పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నకరికల్లు, జూలై 12: మండల స్థాయిలో ఎంఈవో అధ్యక్షతన విద్యార్థులకు నిర్వహించిన వన రక్షణ- మన రక్షణ అనే అంశంపై వ్యాస రచన, క్విజ్, డిబెట్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు మంగళవారం బహుమతులు అందచేశారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న వనమహోత్సవం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మండలంలోని ఎనిమిది, తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. వ్యాస రచనలో గెలుపొందిన అశ్వని, శ్రీలేఖ, నాగజ్యోతికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందచేశారు. డిబేటింగ్‌లో భానుశ్రీ, లాస్య, అశ్వని, రమాదేవిలకు బహుమతులు అందచేశారు. క్విజ్ పోటీల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నకరికల్లు ప్రథమ స్థానం పొందగా, విశ్వశాంతి, బీహెచ్‌ఆర్ స్కూల్స్ ద్వితీయ స్థానాన్ని, శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ టీముల్లోని విద్యార్థులు తృతీయ స్ధానాన్ని కైవసం చేసుకున్నారు. పోటీల్లోని విజేతలకు ఎంఈవో మనె్నం రామారావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అర్జునరావు, పి రమణమ్మ తదితరులు బహుమతులు అందచేశారు. మండల స్థాయిలో గెలుపొందిన విద్యార్థులకు సభాపతి పర్యవేక్షణలో సత్తెనపల్లిలో నిర్వహించు నియోజకవర్గ స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఎంఈవో తెలిపారు. విజేతలకు సభాపతి కోడెల చేతుల మీదుగా బహుమతులు అందచేస్తారని తెలిపారు. మండలంలోని వివిధ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాథ్యాయులు మల్లికార్జునరావు, పాల్గొన్నారు.