గుంటూరు

విద్యుదాఘాతంతో లారీ డ్రైవర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాచర్ల, జూలై 17: ప్రమాదవశాత్తు నడుపుతున్న లారీకి విద్యుత్ వైర్లు తగిలి డ్రైవర్ మృతి చెందిన సంఘటన పట్టణ శివారులోని రాయవరం జంక్షన్ సమీపంలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తె రాయవరం జంక్షన్ సమీపంలోని కోళ్ళ ఫారంలో కోడి పెంటను లోడు చేసేందుకు దుర్గి మండలం ముటుకూరు గ్రామానికి చెందిన ముటుకూరు పెద అమరయ్య పది మంది కూలీలతో కలసి వెళ్లాడు. కోడి పెంట లోడు చేసేందుకు లారీని తిప్పుతుండగా విద్యుత్ వైర్లు లారీ క్యాబిన్‌కు తగిలాయి. దీంతో పెద అమరయ్య (29) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారమిచ్చి విద్యుత్ సరఫరాను నిలిపివేసి క్యాబిన్ నుండి అమరయ్యను బైటకు తీశారు. అప్పటికే అమరయ్య మృతి చెందినట్లు వారు గుర్తించారు. అమరయ్యకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.