గుంటూరు

పెయింటింగ్ వర్కర్స్‌కు ఎన్టీఆర్ వైద్య వైద్య సేవలు అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొన్నూరు, జూలై 17: కార్పొరేట్ సంస్థల్లో వివిధ రకాల కెమికల్స్‌తొ తయారుచేసిన పెయింటింగ్స్ వేస్తున్న కార్మికులకు ఆరోగ్యం కునారిల్లుతున్న నేపథ్యం లో వారికి ఎన్‌టిఆర్ వైద్య సేవ కార్డులు అందించాలని వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గోలి హెర్నేజర్‌బాబు డిమాండ్ చేశారు. ఆదివారం ఎఐటియుసి కా ర్యాలయంలో సంఘ నాయకుడు ఆరేటి రామారావు నేతృత్వంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెయింటింగ్ వర్కర్లకు వృద్ధాప్య పెన్షన్లు రూ. 3 వేలు ఇవ్వాలన్నారు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యం లో కార్మికులకు ప్రభుత్వ పథకాల రేటును రెట్టింపు చేయాలని ఎఐటియుసి నాయకుడు ఆరేటి రామారావు డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగిన కార్మికులకు 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియో చెల్లించాలన్నారు. విలేఖర్ల సమావేశంలో నాయకులు రాజవరపు శివాజీ, ఎ మల్లికార్జునరావు, రాము, వడ్రంగి యూ నియన్ అధ్యక్షుడు పెద్దిరాజు, నిమ్మకాయల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.