గుంటూరు

కడుపుబ్బ నవ్వించిన హాస్యవల్లరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), జూలై 17: బృందావన వెంకన్న సన్నిధిలో అన్నమయ్య కళావేదికపై ఆదివారం రాత్రి గుంటూరు హ్యూమర్‌క్లబ్ సభ్యులు సమర్పించిన హాస్యవల్లరి పెద్దసంఖ్యలో విచ్చేసిన ప్రేక్షక జనావళిని కడుపుబ్బ నవ్వించింది. బొమ్మరిల్లు, భార్యభర్త ఓ బామ్మర్ది, మతిమరుపు, ముందుచూపు, ఆధార్‌కార్డు, ప్రమోషన్, రోబో, హోటల్, ఎంక్వైరీ, డాక్టర్ పేషంట్, పంపకాలు తదితర స్కిట్స్, మైమ్ ప్రదర్శనలను హ్యూమర్‌క్లబ్ సమర్పించగా రెండు గంటలకు పైగా ఈ కార్యక్రమాలను తిలకించిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు మనోహ్లాదం పొందారు. అతిథులుగా విచ్చేసిన వైద్యులు ఎన్ శ్రీనివాసరావు, ఎన్ జనార్ధని, నారాయణ విద్యా సంస్థల జిఎం పి తిలక్‌బాబులు మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడాలంటే నిజజీవితంలో హాస్యం దివ్యౌషధంగా ఉపయోగ పడుతుందన్నారు. హ్యూమర్‌క్లబ్ చేస్తున్న కళాసేవను అతిథులు ప్రశంసించారు. కళాధర్, జె కిషోర్‌బాబు, వి శివప్రసాద్, షేక్ లాల్‌వజీర్, కెవిపి మురళీకృష్ణ, పి మంగయ్య, సయ్యద్ జవహర్, మధుమని, నాగజ్యోతి, సిహెచ్ హనుమాయమ్మ, వై లక్ష్మీ తదితర గుంటూరు హ్యూమర్‌క్లబ్ కార్యవర్గ సభ్యులు, వారి కుటుంబాలు హాస్యవల్లరిని సమర్పించి నవ్వుల జడివానలో కళాభిమానులను ముంచెత్తారు.