గుంటూరు

వర్షం రాకతో వెల్లివిరిసిన ఆనందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదకూరపాడు, జూలై 17: మండలంలో ఆదివారం సాయంత్రం కురిసిన వర్షంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. అధిక వ్యయ ప్రయాసలతో మిరప నారుమళ్లు పెంచేందుకు రైతాంగం పలు ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో వర్షం కొంతమేర ఊరటనిచ్చింది. గత 20 రోజులుగా వర్షం లేక అధిక ఉష్ణోగ్రతలు ఉండుట వలన విత్తిన పత్తిపంట మిరపనారుమళ్లు ఎండుముఖం పట్టాయి. గత వారం రోజులుగా వర్షం కోసం ఆశగా ఆకాశం వైపు చూస్తున్న రైతాంగానికి తాజా వర్షం ధైర్యాన్ని అందించింది. మండలంలోని అన్ని గ్రామాల్లోని పంట పొలాల్లో నీరు పారే స్థాయిలో వర్షం పడటంతో ఉపశమనం కలిగింది.