గుంటూరు

వేగంతో భద్రతా ముఖ్యమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), జూలై 17: మారుతున్న ప్రస్తుత సమాజంలో వేగంతో పాటు భద్రత కూడా ప్రధాన భూమిక వహిస్తుందని ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చి మన్ననలు పొందాలని ఆర్టీసీ ఆర్‌ఎం జ్ఞానంగారి శ్రీహరి పేర్కొన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఆదివారం గుంటూరు 1,2 డిపోల్లో గేట్ మీటింగ్‌లను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎం మాట్లాడుతూ డ్రైవర్లు డ్రైవింగ్ సీట్‌లో కూర్చోగానే ఇంటి విషయాలు, ఇతరత్రా సమస్యల గురించి ఆలోచించడం మానుకోవాలన్నారు. ఏకాగ్రత, చిత్తశుద్ధితో బస్సులు నడపాలన్నారు. భద్రతా సూత్రాలను చదివి స్మార్ట్ డ్రైవింగ్ స్కిల్స్ విధానాలను ప్రతి డ్రైవర్ పాటించి మెరుగైన కెఎంపిఎల్ సాధించాలన్నారు. రీజియన్‌ను లాభాల బాట పట్టించేందుకు ప్రతి డ్రైవర్, మెకానిక్, ఉద్యోగులు కృషి చేయాలన్నారు. ఎటువంటి వైఫల్యాలు, లోపాలు లేని బస్సులు అందించాల్సిన బాధ్యత మెకానిక్‌లపై ఉందని బస్సు డిపో నుండి బయలు దేరే ముందు కండీషన్‌ను డ్రైవర్లు తప్పక చూసుకోవాలన్నారు. ప్రయాణికుల అవసరాలు, ఆర్టీసీ నుండి వారు ఏం కోరుకుంటున్నారనేది గుర్తెరిగి తదునుగుణంగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట డెప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ వెంకటేశ్వరరావు, గుంటూరు 1,2 డిపో మేనేజర్లు మల్లిఖార్జునరెడ్డి, మూర్తి, 1,2 డిపోల కార్మికులు పాల్గొన్నారు.