గుంటూరు

వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 17: పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో ఈనెల 21 ఉదయం 9 గంటల నుండి 2 గంటలలోపు సామూహికంగా 3.36 లక్షల మొక్కలు నాటేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్ పేర్కొన్నారు. ఆదివారం ధరణికోట జెబి గార్డెన్స్ కళ్యాణ మండపంలో జరిగిన నియోజకవర్గస్థాయి సమీక్ష సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలోని 96 గ్రామ పంచాయతీల్లో మొక్కలు పెంపకానికి ఇన్‌చార్జిలను ఏర్పాటు చేస్తున్నామని, కృష్ణానది తీరమంతా హరితశోభితం చేయడమే ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఉద్యమస్ఫూర్తితో పండుగ వాతావరణం నెలకొనేలా అన్ని శాఖల సహకారంతో మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. 21వ తేదీలోపు నిర్దేశించిన ప్రాంతాల్లో ఉపాధి హామీ కూలీల చేత గుంతలు తీయించాలని అధికారులను ఆదేశించారు. అటవీశాఖ అధికారులు మొక్కలు అందజేస్తున్నారని, నాయకులు, అధికారులు చొరవ తీసుకుని కిలోమీటరుకు సుమారు 400 మొక్కలు తగ్గకుండా ఐదు రకాల పండ్ల మొక్కలు నాటాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ రోడ్లు, పొలానికి వెళ్లేరోడ్లు, చెరువుగట్లు, కాల్వగట్ల వెంట మొక్కలు నాటాలన్నారు. ఫొటోలకు పోజులివ్వకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటాలని సూచించారు. మొక్కలు బతికించే నాయకులకే సహకారం ఉంటుందని పేర్కొన్నారు. మండలాన్ని ఐదు భాగాలుగా విభజించి ఒక్కో భాగానికి తహశీల్దార్, ఎండిఒ, ఎఒ, ఎస్‌ఐ, ఉపాధి హామీ పథకం ఎపిఒలను ఇన్‌చార్జిలుగా నియమించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 కోట్ల మొక్కలు నాటించి రెండు శాతం ఉష్ణోగ్రత తగ్గించే లక్ష్యంగా కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో డ్వామా పిడి శ్రీనివాసరావు, ఆర్‌డిఒ శ్రీనివాసరావు, సత్తెనపల్లి డిఎస్‌పి మధుసూధనరావు, వెన్నా సాంబశివారెడ్డి, జెడ్పీ సిఇఒ వెంకట సుబ్బయ్య, డిఆర్‌డిఎ పిడి అబీబ్‌బాషా, డిఇఒ కె శ్రీనివాసులురెడ్డి, ఏపూరి నాగేశ్వరరావు, టిడిపి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.