గుంటూరు

అమరావతిలో భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 17: అమరావతి పరిసర గ్రామాల్లో ఆదివారం మధ్యా హ్నం ఉరుములు, మెరుపులతో కూడి న భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు ఎడతెరపి లేకుండా వర్షం పడింది. సుమారు 10 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది. మండల కేంద్రమైన అమరావతిలోని రాజీవ్, జైల్‌సింగ్, బండచేను కాలనీల్లోని ఇళ్లలోకి వర్షపునీరు చేరింది. ముత్తాయపాలెం వద్ద వాగు పొంగిపొరళి రాకపోకలకు ఇబ్బంది కలిగించింది. లింగాపురం రోడ్డులో రోడ్డుకు ఇరువైపులా కాల్వలు వర్షపునీరు రోడ్లపై ప్రవహించింది. పది రోజులుగా వర్షం లేకపోవడంతో తాజా వర్షం పైర్లకు మేలు చేస్తుందని రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.