గుంటూరు

అవినీతి దూకుడుకు కళ్లెం వేసేది ప్రజలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 17: అభివృద్ధి కంటే అవినీతిలో దూకుడు పెంచిన పాలకులకు రానున్న రోజుల్లో ప్రజలు కళ్లెం వేసి అధికారాన్ని కలగా మార్చనున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గడప గడపకు వైసిపి కార్యక్రమంలో భాగంగా ఆదివారం 27వ డివిజన్ అధ్యక్షుడు కె నాగేశ్వరరావు ఆధ్వర్యంలో చుట్టుగుంట తదితర ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించి ఇంటింటికీ తిరిగి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఫల్యాలను కరపత్రాల రూపంలో వివరించారు. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు కన్నీళ్లను మిగుల్చుతున్న ప్రజాప్రతినిధులకు రానున్న రోజుల్లో తగిన శాస్తి చేయనున్నారని అన్నారు. అధికారం కోసం చంద్రబాబు నాయుడు అమలుకు నోచుకోని వాగ్ధానాలను గుప్పించి ప్రజలను నిలువునా ముంచారని విమర్శించారు. రెండు సంవత్సరాల పాలనలో ఒక్క సంక్షేమ పథకమైనా పూర్తిస్థాయిలో అమలు చేశారా అంటూ ప్రశ్నించారు. వైసిపి రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు తన మేథాసంపత్తితో చంద్రమండలంలో కూడా అవినీతి జెండాను పాతగలరని ఎద్దేవాచేశారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజలు తిరుగుబావుటా ఎగరవేసేందుకు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని గ్రహించిన పాలకులకు వెన్నులో వణుకు మొదలైందన్నారు. చట్టాలను ఇష్టానుసారంగా మార్చుతూ అధికారులను అడ్డం పెట్టుకుని అందినకాడికి దోచుకునే నేతలకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదని అప్పిరెడ్డి హెచ్చరించారు. రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున మాట్లాడుతూ ఓట్లు వేసిన జనమంటే చంద్రబాబుకు లెక్కలేదని, దేవుడంటే భయం పోయిందని, ఇటువంటి పాలకులకు రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ధిచెప్తారని అన్నారు. అంతకుముందు చుట్టుగుంట నుంచి పెద్దఎత్తున అభిమానులు, కార్యకర్తలు ర్యాలీగా నాయకుల వెంట తరలివచ్చారు. తీన్‌మార్ వాయిద్యాలతో నాయకులకు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కిలారి రోశయ్య, అంగడి శ్రీనివాసరావు, దాసరి కిరణ్‌కుమార్, బెంజిమన్, బాలిరెడ్డి, సుబ్బారావు, ఇజ్రాయేల్, బాషా, జగన్ కోటి, యేరువ నర్సిరెడ్డి, పానుగంటి చైతన్య, గోడపాటి కిషోర్, లక్కాకుల నాగేశ్వరరావు, గనిక జాన్సీ, జ్యోతి పాల్గొన్నారు.