గుంటూరు

గుంటూరును తాకిన విగ్రహ విధ్వంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 17: పుష్కరాల నేపథ్యంలో విగ్రహాల విధ్వంస రచన గుంటూరును తాకింది. ఇప్పటి వరకు విజయవాడలో మతాల కతీతంగా భక్తుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో గుంటూరులో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. రోడ్ల విస్తరణలో భాగంగా మునిసిపల్ అధికారులు ఏటుకూరు రోడ్డులోని పురాతన ఆలయంతో పాటు మార్కెట్ సెంటర్ వద్దలగ ప్రాచీనమైన మస్తాన్ దర్గా పరిసరాల్లో ఆదివారం మరోసారి మార్కింగ్ ఇచ్చారు. దీంతో ముస్లిం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో భక్తులు ఆదివారం సమావేశమై అధికారుల తీరును వ్యతిరేకించారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలను అధికారులు ఉల్లంఘిస్తున్నారంటూ మండిపడ్డారు. హిందూ, క్రైస్తవ, ముస్లిం మతాలకు చెందిన వారు ఈ దర్గాలో ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. దర్గా పరిసరాల్లో అధికారులు తొలగింపు చర్యలు చేపట్టేందుకు ప్రయత్నించడంతో భక్తులలో ఆందోళన మొదలైంది. కొద్దిరోజుల క్రితం మార్కింగ్ సమయంలో పెద్దఎత్తున భక్తులు చేరుకుని అధికారులను ప్రతిఘటించారు. అయితే ఇప్పుడు పోలీసుల ప్రమేయంతో కట్టడాలను కూల్చివేయాలని నిర్ణయించడంతో మరోసారి ఆందోళనకు సన్నద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా ఏటుకూరు రోడ్డులో పురాతనమైన హిందూ దేవాలయాన్ని, మస్తాన్ దర్గా వద్ద అధికారులు కవ్వింపు చర్యలకు పాల్పడుతూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నగర పార్టీ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి నిరసన వ్యక్తం చేశారు. అధికారులు ఇలాంటి చర్యలు మానుకోకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా నగరంలోని పలు సెంటర్లలో పలుకుబడి కలిగిన వ్యక్తులు ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టినా అవి తొలగించేందుకు అధికారులు సాహసించలేక పోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అనేక భవనాలు వెలిసినా రాజకీయ ఒత్తిళ్ల కారణంగా వెనుతిరుగుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముందు ఆ ఆక్రమణలు తొలగించిన తరువాతే ప్రార్థనా మందిరాల జోలికి రావాలనే డిమాండ్లు వినవస్తున్నాయి. దీంతో అధికారుల పరిస్థితి ముందు నుయ్యి..వెనుక గొయ్యి చందంగా మారింది. రోడ్ల విస్తరణలో జాప్యం జరిగితే తమను సస్పెండ్ చేసేందుకు కూడా వెనుకాడేదిలేదని మంత్రులు, ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీచేస్తున్నారని, మరోవైపు భక్తుల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించాలని ఆదేశాలిస్తున్నారని దీంతో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయని ఓ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు.