గుంటూరు

రోడ్డు విస్తరణ పేరుతో నివాసాలు కూల్చివేస్తే సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్చంపేట, జూలై 19: నూతన రాజధాని అమరావతిని త్వరితగతిన చేరుకోవడానికి గాను అచ్చంపేటలో చేయబోతున్న రోడ్డు విస్తరణ పనుల నిర్ణయాన్ని ప్రజలు, చిరు వ్యా పారుల శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం విరమించుకుని, ఊరి వెలుపల నుండి బైపాస్ రోడ్డు నిర్మించుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. జిల్లా సర్వే అధికారులు రోడ్డు విస్తరణకై మార్కింగ్ చేయడంతో గ్రామంలో కొద్దిరోజులు గా ఇదే విషయాన్ని ప్రజలు చర్చించుకుంటున్నారు. 70 నుండి 80 యేళ్ల తరబడి ప్రభుత్వ అనుమతితో పక్కా రిజిస్ట్రేషన్లతో నివాసాలు ఏర్పర్చుకుని జీవనం సాగిస్తున్నారు. వీరితో పాటు చిరు వ్యాపారులు, చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకుని బతుకు బండిని ఈడ్చుకొస్తున్నారు. నివాసాల కూ ల్చివేత సమయంలో ఎలాంటి ముం దస్తు సమాచారం గానీ, పరిహారం చెల్లింపుగానీ, ప్రత్యామ్నాయం చూ పడం వంటివేమీ లేకుండా ఏకంగా కూల్చివేస్తామని అధికారుల నండి వస్తున్న సంకేతాలతో ప్రజలు మ రింత బెంబేలెత్తుతున్నారు. జీవనోపాధి కోల్పోతే ఆత్మహత్యలే శరణ్యమని కొందరు చిరువ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. రోడ్డుపై ఉన్న ఆక్రమణలను తొలగిస్తే రహదారి విశాలంగా మారుతుందని, దీనికి తోడు ఊరు బయట ఇప్పటికే ఉన్న రోడ్డుమార్గాన్ని బైపాస్‌రోడ్డుగా మెరుగులు దిద్దితే మరింతగా ఉపయోగ పడుతుంద ని సూచిస్తున్నారు. రోడ్డు విస్తరణ అంటూ పేదల, చిరువ్యాపారుల నివాసాలు, దుకాణాల జోలికి వస్తే ప్రజల నుంచి నిరసనను ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ విషయమై మంగళవారం పలువురు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్‌ను కలిసి విన్నవించారు. శ్రీ్ధర్ స్పందిస్తూ రోడ్డుకు ఇరువైపులా ఉన్న కాల్వ హద్దును దాటి ఉన్న ఆక్రమణలను స్వచ్చంధంగా తొలగించుకోవాలని, పూర్తిగా సహకరిస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు.