గుంటూరు

నడకతోనే ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 7: నడకతో ఆరోగ్య సమస్యలను మటుమాయం చేయవచ్చని పెదకూరపాడు ఎమ్మెల్యే డాక్టర్ కొమ్మాలపాటి శ్రీ్ధర్ పేర్కొన్నారు. అమరావతి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటుచేసిన 4కె వాక్ పోటీల విజేతలకు బహుమతి ప్రదానోత్సవ సభలో ఎమ్మెల్యే శ్రీ్ధర్ ముఖ్య అతిథిగా ప్రసంగించారు. సమావేశానికి అసోసియేషన్ అధ్యక్షుడు వి సంగమేశ్వరాచారి అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే శ్రీ్ధర్ మాట్లాడుతూ అమరావతిలో ఉన్న ధ్యానబుద్ధ ప్రాజెక్టు వద్ద త్వరలో వాకింగ్‌ట్రాక్ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్టమ్రంత్రి అచ్చెన్నాయుడు సహకారంతో అమరావతిలో మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. త్వరలో అమరావతి రూపురేఖలు మారనున్నాయన్నారు. పురుషులు, మహిళలకు వేర్వేరుగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్ బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవాధ్యక్షులు కొండవీటి శ్రీనివాసరావు, ప్రముఖ వైద్యులు డాక్టర్ సీతారామయ్య, అమరావతి, ధరణికోట సర్పంచులు జి నిర్మలాదేవి, బేతపూడి యలమంద, పెనుముచ్చు రామకృష్ణ, ఎండిఒ రాజగోపాల్, విన్నకోట సాంబశివరావు, ఆంధ్రాబ్యాంకు మేనేజర్ ఆర్‌ఎస్ రవీంద్రనాథ్, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.