గుంటూరు

పుష్కరాల సమయంలో ప్రాణ నష్టం జరగకుండా చూడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లి, జూలై 24: రాష్ట్ర ఇన్‌చార్జ్ డిజిపి నండూరి సాంబశివరావు ఆదివారం సాయంత్రం సీతానగరం పుష్కరఘాట్‌లు పరిశీలించారు. తొలుత ముఖ్యమంత్రి నివాస గృహంలో సిఎంను కలుసుకున్న ఆయన అనంతరం పుష్కరఘాట్లు పరిశీలించారు. ఆయన ప్రకాశం బ్యారేజ్ నుండి ఘాట్ వరకూ నడుస్తూ పరిసరాలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందితో మాట్లాడుతూ పుష్కరాల్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని, అందుకు అవసరమైన అన్ని రకాల ప్రణాళికలు ముందుగా సిద్ధం చేసుకోవాలని అన్నారు. పుష్కరఘాట్లకు వచ్చే భక్తుల సౌకర్యార్థం రైల్వే, బస్సులు, ఇతర ప్రయాణ సమాచారాన్ని అన్ని దేవాలయాల నుండి ప్రతి పది నిమిషాలకు ఒకసారి ప్రసారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సీతానగరం పుష్కరఘాట్లకు భక్తులు వచ్చే ప్రధాన మార్గాలన్నింటిలోనూ ట్రాఫిక్‌జాం అవకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూడాలన్నారు. గుంటూరు, తెనాలి వంటి ప్రాంతాల నుండి వచ్చే బస్సులు పుష్కరఘాట్లకు ఎంత దూరంలో నిలిపివేస్తారో, ఎన్ని బస్సులు ఏర్పాటు చేయనున్నారో తదితర వివరాలను ఆర్టీసీ ఆర్‌ఎంని అడిగి తెలుసుకున్నారు. పుష్కరాలకు విచ్చేసే భక్తుల సేవలందించటానికి ఉన్న సిబ్బందితో మూడు షిఫ్టులు తొలగించి, రెండు షిప్టులు ద్వారా 12 గంటలు విధులు నిర్వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని గుంటూరు అర్బన్, రూరల్ ఎస్పీలను ఆయన ఆదేశించారు. గుంటూరు జిల్లా అర్బన్, రూరల్ ఎస్పీలు త్రిపాఠి, నారాయణ్‌నాయక్, నార్త్‌జోన్ డి ఎస్పీ రామాంజనేయులు, తాడేపల్లి ఎస్సైలు వినోద్‌కుమార్, ప్రతాప్‌కుమార్, తదితరులు డిజిపి వెంట ఉన్నారు.