గుంటూరు

వనం-మనంలో అందరినీ భాగస్వాములను చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 26: హరితాంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా ఈనెల 29న రాష్టవ్య్రాప్తంగా చేపట్టనున్న వనం-మనం కార్యక్రమంలో ప్రజలందరినీ భాగస్వాములను చేసి విజయవంతం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం విజయవాడ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వనం-మనం కార్యక్రమం, కృష్ణా పుష్కరాల పనుల పురోగతి, ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ వనం-మనం కార్యక్రమం ద్వారా ఈనెల 29న రాష్టవ్య్రాప్తంగా కోటి 47 లక్షల మొక్కలను నాటేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థినీ, విద్యార్థులు, స్వచ్చంధ సంస్థలు, డ్వాక్రా సంఘాల సభ్యులు, వన సంరక్షణ సమితి సభ్యులను భాగస్వాములను చేయాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలలు, పరిశ్రమలు ఆధ్యాత్మిక ప్రదేశాలు బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, రహదారులకు ఇరువైపులా వంటి అన్ని ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు అనువైన స్థలాలను గుర్తించి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఒక్క 29వ తేదీనే కాకుండా కార్యక్రమం నిరంతరం కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. తుపాన్ల సమయంలో తట్టుకునేందుకు వీలైన మొక్కలను నాటాలని సూచించారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మొక్కలను సంరక్షించేందుకు ఉపాధి హామీ పథకం నుండి నిధులు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఆగస్టు 12 నుండి జరగనున్న కృష్ణా పుష్కరాలకు సంబంధించి కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో చేపట్టిన పనులను, చేపట్టాల్సిన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సమీక్షించారు.