గుంటూరు

కొబ్బరికి గిట్టుబాట ధర కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, జూలై 31: కొబ్బరి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ భారతీయ కిసాన్‌సంఘ్ జాతీయ కార్యవర్గ సమావేశం తీర్మానించిందని అఖిల భారత కిసాన్‌సంఘ్ ప్రధాన కార్యదర్శి మోహినీ మోహన్ మిశ్రా వెల్లడించారు. భారత కిసాన్ సంఘ్ జాతీయ కార్యవర్గ సమావేశాలు మండల పరిధిలోని నూతక్కి విజ్ఞాన విహార పాఠశాల ప్రాంగణంలో మూడురోజుల పాటు జరిగి ఆదివారం సాయంత్రం ముగిశాయి.
ఈ సందర్భంగా మోహినీ మోహన్ మిశ్రా మాట్లాడుతూ రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చే అక్టోబర్ 10న ఒకేరోజు 500 మంది ఎంపీలను బికెఎస్ ప్రతినిధులు కలిసి వినతిపత్రాన్ని అందజేస్తారని తెలిపారు. కొబ్బరినూనెను ఆహారపు నూనెగా ప్రకటించాలని తమిళనాడు. కేరళ రాష్ట్రాల్లో కొబ్బరినూనెను వంటగా వాడుతున్నారని ఆయన అన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి పార్లమెంట్ ప్రత్యేక సమావేశం నిర్వహించడం అవసరమని, 70 శాతానికి పైగా ప్రజలు దేశంలో వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అఖిల భారత బికెఎస్ అధ్యక్షుడు బసెవె గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్గనైజింగ్ సెక్రెటరీ దినేష్ దత్తాత్రేయ కులకర్ణి, ఉపాధ్యక్షుడు ప్రభాకర్ కేల్కర్, జాతీయ కార్యదర్శులు పెరుమాళ్, కె సాయిరెడ్డి, ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ తదితరులు మాట్లాడారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 150 మంది ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను సమావేశంలో చర్చించారు. కుమారస్వామి, జిఎస్ కృష్ణకుమార్, రాము తదితరులు పాల్గొన్నారు.