గుంటూరు

పుష్కరాలకు ఆర్టీసీ సిబ్బంది సహకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), ఆగస్టు 4: కృష్ణా పుష్కరాలకు ఆర్టీసీలోని వివిధ యూనియన్లు, సిబ్బంది సహాయ సహకారాలు అందించాలని రీజనల్ మేనేజర్ జ్ఞానంగారి శ్రీహరి పేర్కొన్నారు. గురువారం ఎన్‌టిఆర్ బస్‌స్టేషన్ తిక్కన కాన్ఫరెన్స్ హాలులో రీజియన్‌లోని అన్ని యూనియన్ల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ దూర ప్రాంతాల నుండి వచ్చే సిబ్బందికి అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. తనిఖీ అధికారులకు పుష్కరాల సమయంలో పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు. జిల్లాలో జరుగుతున్న పుష్కరాలను ఒక ఛాలెంజ్‌గా తీసుకుని తమ శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. సమావేశంలో డెప్యూటీ సిటిఎం నరసరావుపేట వెంకటేశ్వరరావు, ఎంప్లారుూస్ యూనియన్, సిఐటియు, టిఎన్‌టియుసి, తదితర యూనియన్ నాయకులు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.