గుంటూరు

చేనేత సంక్షేమానికి ప్రభుత్వం కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, ఆగస్టు 7: చేనేత పరిశ్రమ, కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేనేత వర్గాల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా ఉన్నారని రాష్ట్ర చేనేత ఎక్సైజ్ శాఖామంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం మంగళగిరి పట్టణ శివారులోని ఎర్రబాలెం వద్ద గల రాష్ట్ర చేనేత కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి రవీంద్ర పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర విభజన తరువాత ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులున్నప్పమటికీ చేనేత వర్గాలకు 110 కోట్ల రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. చేనేత కార్మికులకు నివాసఘృసంతో పాటు వర్క్‌షెడ్ నిర్మించుకోవడానికి 3 లక్షలు ఇస్తున్నామని, రాయితీపై నూలు అందజేస్తున్నామని, త్వరలోనే చేనేత సలహాబోర్డు ఏర్పాటవుతుందని మంత్రి రవీంద్ర అన్నారు. మాజీ ఆప్కోచైర్మన్ మురుగుడు హనుమంతరావు, మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి, చేనేత జౌళిశాఖ సహాయ సంచాలకులు సుంకర రమేష్, పలువురు అధికారులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు. చేనేత కార్మికులను వేదికపై మంత్రి రవీంద్ర చేతులమీదుగా సత్కరించారు.