గుంటూరు

కుంగిన రోడ్డుకు మరమ్మతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంకొండ, ఆగస్టు 11: రోడ్డు వేసి పట్టుమని ఐదు నెలలు కూడా గడవ లేదు. తారు రోడ్డుకు ఇప్పటికే పలు చోట్ల గుంతలు పడటంతో పాటు రోడ్డు కుంగి పోయింది. బెల్లంకొండ క్రాస్ రోడ్డు నుండి మాచాయపాలెం అడ్డ రోడ్డు వరకు 2.80 కోట్ల రూపాయలతో రెండు వరుసల రోడ్డు నిర్మించారు. రోడ్డు వేసిన నెల రోజుల నుండే గుంతలు ప్రారంభమయ్యాయి. గ్రావెల్ బయట పడటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న 40 అడుగుల రోడ్డు రెండు అడుగుల మేర కుంగింది. దీన్ని చూసిన ప్రజానీకం, గుత్తేదారులు రోడ్లు ఎంత నాణ్యతగా వేశారోనని చెవులు కొరుక్కుంటున్నారు.
డిఇ సుబ్బయ్య వివరణ
లూజు సాయల్ ఉండటం వలన రోడ్డుకు గుంతలు పడ్డాయని, వాటికి వెంటనే పూర్తిగా మరమ్మతులు చేస్తామన్నారు.