గుంటూరు

కృష్ణాతీరం... జనసంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్చంపేట, ఆగస్టు 19: కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తుల తాకిడి శుక్రవారం మరింత పెరిగింది. కృష్ణాతీరమంతా పుణ్యస్నానాలకు వచ్చిన భక్తులతో జనసంద్రమైంది. శ్రావణ శుక్రవారం కావడంతో మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి కృష్ణమ్మకు పూజలు చేసి హారతులు పట్టారు. పెద్ద, చిన్న తారతమ్యాలను మరిచి కొన్ని క్షణాల పాటు తన్మయత్వంతో జలకాలాడారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడంతో పాటు తమ దూరపు చుట్టాల కోసం కృష్ణానీటిని బాటిళ్లలో తీసుకెళ్తున్నారు. కోనూరు పుష్కరఘాట్‌తో పాటు మరికొన్ని ఘాట్లలో చిన్నారులకు పాలు, బిస్కెట్ ప్యాకెట్లు అందించారు. నందులరేవు పుష్కరఘాట్‌లో 4,500, మాదిపాడులో 242, గింజుపల్లిలో 250, తాడువాయి 32, చింతపల్లి 1300, చామర్రు 710, కోగంటివారిపాలెంలో 257, కోనూరు 757, కస్తల పుష్కరఘాట్‌లో 2374 మంది శుక్రవారం పుణ్యస్నానాలు ఆచరించారు. మొత్తం 10,710 మంది యాత్రికులు కృష్ణమ్మ రుణం తీర్చుకున్నారు. అన్నదానాలు కొనసాగుతున్నాయి.