గుంటూరు

జీవితాన్ని నిండుగా పండించేది హాస్యమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), ఆగస్టు 21: ధన ప్రాముఖ్యత పెరిగి, మానవ సంబంధాలు తరిగిపోతున్న నేటి పరిస్థితుల్లో మానవుడికి ప్రశాంతతను అంతకుమించి జీవితాన్ని నిండుగా పండించడానికి హాస్యం పరమ ఔషధంలాగా దోహద పడుతుందని రాష్ట్ర విధాన పరిషత్ సభ్యుడు వివివి చౌదరి అన్నారు. ఆదివారం రాత్రి నగరంలోని బందావన గార్డెన్న్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అన్నమయ్య కళావేదికపై గుంటూరు హ్యూమర్‌క్లబ్ ఆధ్వర్యాన 50వ హాస్యవల్లరిని వందలాది మంది ప్రేక్షకుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యఅతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసిన ఎమ్మెల్సీ చౌదరి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనలో కూడా హాస్యం కీలకపాత్ర ఎప్పుడూ పోషిస్తూనే ఉందన్నారు. నవ్వుతూ ఉండండి, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఆనందంగా ఉండేలా చూడండి అని ఆయన సభా పూర్వకంగా కోరారు. మరో అతిథి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గుంటూరు శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎం ప్రసాద్ ప్రసంగిస్తూ క్లిష్ట సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో కడుపుబ్బ నవ్వు ప్రశాంతతను, మానసిక ఆహ్లాదాన్ని కల్గిస్తుందన్నారు. ఒక్కొక్కప్పుడు మందులు చేయలేని పని నవ్వు చేస్తుందని ఆయన అన్నారు. అతిథులంతా హ్యూమర్‌క్లబ్ చేస్తున్న కళాసేవను కొనియాడారు.
కడుపుబ్బ నవ్వించిన హాస్యకదంబం...
గుంటూరు నగరంలో హ్యూమర్‌క్లబ్‌ను ఏర్పాటుచేసిన నెల నెలా క్రమం తప్పకుండా తమ కుటుంబాలతో కలిసి సమర్పిస్తున్న హాస్యవల్లరి కళాభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. కృష్ణా పుష్కరాలు ముగింపుకు చేరుకుంటున్న దశలో బృందావన వెంకన్న పాదాల చెంత హ్యూమర్ క్లబ్ ఆదివారం రాత్రి వారి బృందంతో సమర్పించిన 50వ హాస్యవల్లరి కడుపుబ్బ నవ్వించడమే కాకుండా ప్రేక్షకులను పొట్టచక్కలయ్యేలా చేసింది. కిలాడి అల్లుడు, కురుక్షేత్రంలో సెల్ఫీ, కాలం కలిసొత్తే, బతుకు చెట్కాబండీ, బ్రేకింగ్ న్యూస్, ఓపెన్ హార్ట్ విత్ పీకె, పార్ట్ -2 లఘునాటికలు అందరినీ ఆనంద పరవశులను చేశాయి. షేక్ లాల్‌వజీర్ ఆధ్వర్యాన ఈ కార్యక్రమం రసవత్తరంగా సాగింది. కళాకారులందరికీ దేవస్థాన అధ్యక్షుడు మస్తానయ్య ప్రసాదాలు అందజేశారు. ప్రొఫెసర్ ఎం రామారావు, జంపని కిషోర్‌బాబు, పత్తిపాటి మంగయ్య, హ్యూమర్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.