గుంటూరు

’అక్రమ మెమోలు చట్ట విరుద్ధమే‘

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాచర్ల, ఆగస్టు 30: అక్రమంగా ఇస్తున్న మెమోలు, షోకాజ్ నోటీసులు ట్రేడ్ యూనియన్ చట్టాలను కాలరాసే ప్రయత్నాలేనని అఖిల భారత అంగన్‌వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు అన్నారు. ఈనెల 2న చేపట్టనున్న సార్వత్రిక సమ్మెకు మద్దతుగా తాము సమ్మె చేస్తున్నట్లు మంగళవారం సీడీపీవో వెంకట రమణకు నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ అంగన్‌వాడి వర్కర్ల కనీస వేతనం రూ.20 వేలు, హెల్పర్లకు రూ.17వేలు ఇవ్వాలన్నారు. రిటైర్‌మెంటు వర్కర్‌కు రూ. 2 లక్షలు, ఆయాకు లక్ష గ్రాట్యుటీ ఇవ్వాలన్నారు. చివరి నెల జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడి వర్కర్స్‌ను 3వ తరగతి ఉద్యోగులుగా, ఆయాను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. వినతిపత్రం సమర్పించినవారిలో యూనియన్ నాయకులు ప్రసన్నరాణి, ఇందిర, మల్లేశ్వరి ఉన్నారు.