గుంటూరు

చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు జగన్‌కు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), సెప్టెంబర్ 4: రాష్ట్రాన్ని లోటుబడ్జెట్‌లోనూ అభివృద్ధి పథాన పురోగమింపజేస్తున్న నిత్య కృషీవలుడు చంద్రబాబు నాయుడును విమర్శించే నైతిక హక్కు ప్రతిపక్ష నేత జగన్‌కు లేదని టిడిపి జిల్లా అధ్యక్షుడు జివి ఆంజనేయులు ఆక్షేపించారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్భ్రావృద్ధికి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్న జగన్ ప్రజా సంక్షేమానికి మోకాలడ్డుతున్నారని ధ్వజమెత్తారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టులకు ఆటంకం కల్గించారని, అనంతపురం జిల్లాలో కరవు తాండవిస్తుంటే ముఖ్యమంత్రి చొరవతో రెయిన్ గన్స్ పంపిణీచేసి రైతులను ఆదుకుంటుంటే వాటిపైనా విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజాసంక్షేమం పట్టని జగన్ అధికారమే ధ్యేయంగా ప్రభుత్వం చేసే ప్రతీపనిని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేలకోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టారని ఆరోపించారు. పరిపక్వతలేని ప్రతిపక్ష నేత జగన్ వలనే రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏదైనా అల్లర్లు సృష్టించి ప్రభుత్వంపై బురద జల్లేందుకు యత్నిస్తున్నారన్నారు. చివరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలే వైసిపిని వీడుతున్నారన్నారు. చివరకు పిల్ల కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయమని జోస్యంచెప్పారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణాడెల్టాకు తరలించి వేల ఎకరాలు సాగులోకి తెచ్చామన్నారు. ఇక్కడ్నుంచి రాయలసీమకు నీరు మళ్లించేందుకు ప్రభుత్వం యోచిస్తుంటే జగన్ ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందన్న ఉద్దేశంతోనే కరవును రాజకీయం చేస్తున్నారన్నారు. విలేఖర్ల సమావేశంలో మార్కెట్‌యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు, పార్టీ నాయకులు కంచర్ల శివరామయ్య, లాల్‌వజీర్, షౌకత్, సుఖవాసి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.