గుంటూరు

పుష్కరకాలంగా నిరీక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 4: నామినేటెడ్ పదవులు భర్తీ చేయకపోవటంతో తెలుగుతమ్ముళ్లలో నైరాశ్యం పెరుగుతోంది. పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నామని.. ఇప్పుడు అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ తమకు గుర్తింపు లభించటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ద్వితీయశ్రేణి నాయకులు గత పుష్కరకాలంగా నామినేటెడ్ పదవుల కోసం నిరీక్షిస్తున్నారు. గుంటూరు మార్కెట్ యార్డు పదవులకు ఎంపిక జరిగినా అందులో ఆధిపత్య పోరు కారణంగా ఎవరూ పదవులను అలంకరించలేదు. రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకంలో ఇతర జిల్లాలకు ఇచ్చిన ప్రాధాన్యత రాజధాని జిల్లాకు లేదని వాదిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ మార్కెట్ కమిటీలు, ఆలయాల పాలకవర్గ పదవులతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలైన కార్పొరేషన్ల నామినేటెడ్ పదవుల కోసం ఆశావహులు రెండున్నరేళ్లుగా నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ప్రయోజనం కనిపించటంలేదు. ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీలో నిరాసక్తత చూపుతోందనే విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పదవులలో జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చారు. ఏపిఐఐసి, గ్రంథాలయాల సంస్థల చైర్మన్ పదవులతో పాటు అనేకమంది డైరెక్టర్లుగా నియమితులయ్యారు. పార్టీలో ఆధిపత్య పోరు ఉన్న నేపథ్యంలో రెండున్నరేళ్ల రాజీ ఫార్ములాతో పోస్టులు భర్తీ చేశారు. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నామినేటెడ్ పదవుల పందారంలో ఆచితూచి అడుగేస్తున్నారు. దీంతో మితిమీరిన జాప్యం జరుగుతోందనే భావన వ్యక్తమవుతోంది. గుంటూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి సైతం సీఎం వద్ద పంచాయతీ జరగటంతో విసుగెత్తి పదవుల పంపకాలను ప్రస్తుతానికి నిలిపివేసినట్లు చెప్తున్నారు. దీనికితోడు వలసలు పార్టీలో చేరటంతో ఎన్నో ఏళ్లుగా పార్టీలో ఉన్న తమకు ప్రాతినిధ్యం ఉంటుందో లేదో అనే సందేహాలు క్యాడర్‌లో వినవస్తున్నాయి. షెడ్యూల్ 9,10 ప్రకారం ప్రభుత్వరంగ సంస్థల విభజన జరగని కారణంగా కొన్ని కార్పొరేషన్ల పాలకవర్గాలకు విఘాతం కలుగుతోందని ఉన్న పదవులనైనా భర్తీచేస్తే ఏదో హోదా ఉంటుందని ద్వితీయశ్రేణి నాయకులు ఆశిస్తున్నారు.