గుంటూరు

క్యాథలిక్ గుంటూరు పీఠాధిపతిగా భాగ్యయ్య పట్ట్భాషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), సెప్టెంబర్ 8: గుంటూరు నగరమే కాకుండా జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వేలాదిగా విచ్చేసిన విశ్వాసులు, వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన 12 మంది బిషప్‌లు, విభిన్న రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో గుంటూరు క్యాథలిక్ 6వ పీఠాధిపతిగా రెవరెండ్ ఫాదర్ చిన్నాబత్తిని భాగ్యయ్య పట్ట్భాషిక్తుడైనారు. గురువారం రాత్రి 8 గంటలకు నగరంలోని రింగురోడ్డు డాన్‌బాస్కో చర్చి ప్రాంగణం బిషప్ బంగ్లాలో జరిగిన వేడుకల్లో భాగ్యయ్య చేత వ్యాటికన్ నేపాల్ రాయబారి ప్రత్యేకంగా విచ్చేసిన పోప్ దూత సల్వతోరా పినాకియో ప్రమాణ స్వీకారం చేయించారు. దైవసేవ, దీనజన సేవలో పునరంకితమవుతానని బిషప్‌గా పట్ట్భాషిక్తుడైన భాగ్యయ్య మేరీమాతను స్మరించుకుంటూ ప్రతిజ్ఞ చేశారు. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం తాళ్లచెరువు గ్రామం నుంచి నల్గొండ జిల్లా మోటకుండూరు ప్రాంతానికి తరలివెళ్లిన గ్రామీణ కుటుంబం నుంచి వచ్చిన భాగ్యయ్యను గుంటూరు రోమన్ క్యాథలిక్ 6వ పీఠాధిపతిగా నియమిస్తూ పోప్ జాన్‌పాల్ ఆదేశాలు జారీచేశారు. ఇప్పటిదాకా 32 యేళ్ల పాటు గుంటూరు క్యాథలిక్ మేత్రాసన అగ్ర పీఠాధిపతిగా సేవలందించిన బిషప్ గాలిబాలి, పలు ప్రాంతాల నుంచి వచ్చిన గురువులు, నన్‌లు తోడ్కొని రాగా భాగ్యయ్య ప్రమాణ స్వీకారం చేశారు. నరసరావుపేట ఎంపి రాయపాటి సాంబశివరావు, జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, అనేక మంది ప్రజాప్రతినిధులు అధికారులు, వివిధ క్రైస్తవ సంఘాల నాయకులు పట్ట్భాషేక మహోత్సవాల్లో పాల్గొని భాగ్యయ్యకు శుభాకాంక్షలు అందించారు. పోప్ దూత సల్వతోరా పినాకియో పోప్ ఫ్రాన్సిస్ అందించిన నియామక పత్రాన్ని చదివి వినిపించి వాటికన్ సిటీ పక్షాన ఆశీస్సులు, శుభాకాంక్షలు అందజేశారు.