గుంటూరు

22 నుంచి జాషువా పద్యానికి పట్ట్భాషేకోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), సెప్టెంబర్ 19: కులం కాదు, గుణం మిన్న, మతం కన్నా మానవత్వమే మిన్న అని ధర్మంతో పాటు దార్శనిక దృష్టికూడా కలిగి ఉండాలని తన కవిత్వం ద్వారా ప్రపంచానికి తెలియజెప్పిన కవికోకిల గుర్రం జాషువాకు కవితా నీరాజనాలర్పించడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. ఈనెల 22వ తేదీ గురువారం ఉదయం 9 గంటలకు డప్పు కళాకారులతో జజ్జనకరిజనారే పేరిట యాత్రను నిర్వహిస్తున్నామని, అదేరోజు సాయంత్రం 6 గంటలకు బృందావన గార్డెన్స్ అన్నమయ్య కళావేదికపై జాషువా సాహిత్యం, చర్చపై తమ మనోభావాలను వెల్లడించనున్నారని, ఈ పట్ట్భాషేకోత్సవాన్ని తన భుజస్కందాలపై వేసుకున్న మాజీ మంత్రి, మహాకవి జాషువాకళాపీఠం అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ వెల్లడించారు. సోమవారం సాయంత్రం లక్ష్మీపురంలోని తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అట్టడుగువర్గాల ఆర్తనాదాన్ని వినిపించి సామాజిక జాగృతికి ప్రాణంపోసిన జాషువా స్మరించుకుంటూ 121వ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని జాషువా పద్యానికి పట్ట్భాషేకోత్సవాన్ని ఏర్పాటు చేశామన్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా 3వ రోజైన శనివారం ఉదయం 9 గంటలకు నగరంపాలెంలోని పోలీసు కళ్యాణ మండపంలో ముఖ్య అతిథిగా విచ్చేసే తమిళనాడు పూర్వ గవర్నర్ కె రోశయ్య చేతుల మీదుగా ఇటీవలె మూర్తిదేవి అవార్డును అందుకున్న ఆచార్య పద్మశ్రీ కొలకలూరి ఇనాక్‌కు గౌరవ సత్కారం చేయనున్నామన్నారు. అదేరోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి గజల్ శ్రీనివాస్, నరాలశెట్టి రవికుమార్, బండారు పద్మ, దేవ సహాయం, బద్వేల్ శ్రీహరి తదితరులు జాషువా పద్యాలను ఆలపిస్తారన్నారు. ఉత్సవాల్లో భాగంగా వందమందికి పైగా కవులు, కళాకారులు, విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించి సత్కరించనున్నామన్నారు. 25వ తేదీ ఆదివారం అమరావతిరోడ్డులోని అన్నదాన సత్రంలోనూ, 5వ రోజు లక్ష్మీపురం అభ్యుదయ మహిళా కళాశాల ప్రాంగణంలో, 6వ రోజు వెంకటేశ్వరా విజ్ఞాన మందిర వేదిక, 7వ రోజు సాయంత్రం 6 గంటలకు లక్ష్మీపురం కాటన్ అసోసియేషన్ హాలులో వివిధ సభలు, సదస్సులు ఏర్పాటు చేశామన్నారు. రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ హాజరయ్యే సభకు జిల్లా రిజిష్ట్రార్ చావలి బాలస్వామి అధ్యక్షత వహిస్తారని, అనేక మంది కవులు, సాహితీవేత్తలు పాల్గొంటారని తెలిపారు. విలేఖర్ల సమావేశంలో ఎస్‌కె మస్తాన్‌వలి, సముద్రాల కోటేశ్వరరావు, విల్సన్ తదితరులు పాల్గొన్నారు.