గుంటూరు

పొంగిపొర్లుతున్న వాగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 22: అమరావతి-క్రోసూరు రహదారిలో జూపూడి, మునగోడు గ్రామాల మధ్య గల నక్కలవాగు, ఎద్దువాగులు ప్రమాదస్థాయిలో పొంగిపొరలి రాకపోకలకు అంతరాయం కల్గించాయి. సత్తెనపల్లి, పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీవర్షాల మూలంగా ఒక్కసారిగా వాగుల ప్రవాహం పొంగిపొరలడంతో జూపూడి, మునగోడు గ్రామాలకు చెందిన ఐదుగురు రైతులు ప్రవాహంలో కొట్టుకుపోయి సమీపంలో ఉన్న చెట్లు పట్టుకుని ప్రాణాలు దక్కించుకున్నారు. సమాచారం తెలుసుకున్న వెంటనే అమరావతి సిఐ మురళీకృష్ణ, తహశీల్దార్ కర్లపాలెం శివన్నారాయణమూర్తి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను రప్పించారు. అమరావతి ఎస్‌ఐ వెంకట ప్రసాద్, ఎఎస్‌ఐ శ్రీహరి, ఎన్‌డిఆర్‌ఎఫ్ సభ్యులు నీళ్లల్లో ఉన్న వారిని ఒడ్డుకు సురక్షితంగా చేర్చారు. మేకల బాజి, బంగా నాగయ్యలు మిరపనారు పీకడానికి వెళ్లగా వరదనీరు ఒక్కసారిగా రావడంతో తాడిచెట్లు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. దోసకాయలు కోయడానికి వెళ్లిన నేలపాటి సురేష్, స్వామి, బెంజిమన్‌లు కూడా సమీపంలో ఉన్న చెట్లను పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. వీరందరినీ అధికారులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అలాగే మునగోడు, జూపూడి గ్రామాల్లో 1500 ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. ఈ రహదారిలో ఎటువంటి రాకపోకలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. సాయంత్రం సమాచారం తెలుసుకున్న వెంటనే మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, టిడిపి జిల్లా అధ్యక్షుడు జివి ఆంజనేయులు సత్తెనపల్లి వైపుగా వచ్చి బాధితులను పరామర్శించారు. అలాగే అమరావతి వద్ద కృష్ణానది సుమారు 15 అడుగుల ఎత్తులో పొంగి పొరలి ప్రవహిస్తుంది. కృష్నానదికి జలకళ రావడంతో పర్యాటకులు విశేషంగా తిలకించారు.