గుంటూరు

మహాత్ముని సాక్షిగా స్వచ్ఛ్ తెనాలిలో భాగస్వాములవౌతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, అక్టోబర్ 2: గాంధీ మహాత్ముని సాక్షిగా మేమందరం స్వచ్ఛ్ భారత్ స్పూర్తితో స్వచ్ఛ్ తెనాలి కార్యక్రమంలో భాగస్వాములవౌతామని పట్టణ ప్రజలతో తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రతిజ్ఞ చేయించారు. జాతిపిత మహాత్మాగాంధీ 148వ జయంతిని పురస్కరించుకుని, స్వచ్ఛ్ తెనాలి కార్యక్రమం సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా పట్టణంలోని శివారు ప్రాంతాల్లో అధికారులు, కౌన్సిలర్లు, ప్రజలతో కలిసి ఎమ్మెల్యే పాదయాత్ర నిర్వహించారు.
వార్డుల్లోని ప్రతి వీధి తిరుగుతూ పారిశుద్ధ్య సమస్యలపై ఫిర్యాదులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ 2015 అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి నుండి ఈ సంవత్సరం అక్టోబర్ 2 వరకు తెనాలిలో స్వచ్ఛ్ భారత్ స్ఫూర్తిగా స్వచ్ఛ్ తెనాలి కార్యక్రమాన్ని ప్రజలు, వ్యాపారులు, ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో విజయవంతం చేశామన్నారు. ఈ సంవత్సరం గాంధీ జయంతి నుండి వారం రోజులపాటు పట్టణంలో తిరుగుతూ పారిశుద్ధ్య సమస్యలు తెలుసుకుని ప్రజల సమక్షంలోనే వాటికి పరిష్కారం చూపి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. దాదాపు 90 శాతం వీధులను సిమెంటు రోడ్లుగా మార్చామన్నారు. కోట్లాది రూపాయలతో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తున్నామన్నారు. గుంటలు, ఖాళీ స్థలాల్లో నీటి నిల్వలు లేకుండా, దోమలు పెరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. క్రమంగా పెరుగుతున్న దోమలపై దాడి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని ఈ కార్యక్రమాలు కూడా విజయవంతం కావాలంటే ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేస్తూ ప్రజలు, అధికారులు, కౌన్సిలర్లు, టిడిపి నాయకులు, కార్యకర్తలతో వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.