గుంటూరు

మంగళాద్రిలో వైభవంగా దసరా వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, అక్టోబర్ 4: దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని వివిధ దేవాలయాల్లో జరుగుతున్న దసరా వేడుకల్లో మంగళవారం శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి ఆలయంలో భ్రమరాంబ అమ్మవారు ధనలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శన మిచ్చారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో రాజ్యలక్ష్మీ అమ్మవారు విజయలక్ష్మిగా, పట్టణంలోని కాళీమాతా ఆలయంలో అన్నపూర్ణాదేవిగా, వెంకటేశ్వర స్వామి ఆలయంలో పద్మావతీదేవి ధాన్యలక్ష్మిగా, వాసవీ కన్యకా పరమేశ్వరి గాయత్రీదేవిగా, కోర్టు ఎదుట అఖిలాండేశ్వరి అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చారు. పెదకోనేరు వద్ద దుర్గ్భావాని అమ్మవారు ధనలక్ష్మిగా, దుర్గానగర్ కనకదుర్గమ్మ లలితా త్రిపుర సుందరిగా, హుస్సేన్‌కట్ట వద్ద కనకదుర్గమ్మ కాత్యాయినీ దేవిగా, మార్కెట్ సెంటర్లో అమ్మవారు కాశీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు కనువిందు చేశారు. మార్కెట్ సెంటర్లో రంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయానికి విద్యుత్ కాంతులతో మెరిసిపోయింది.