గుంటూరు

సేద్యాన్ని అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు: ఆర్కే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, అక్టోబర్ 15: సేద్యాన్ని అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. మండల పరిధిలోని నిడమర్రు ఎత్తిపోతల పథకం ద్వారా భూ సమీకరణలో భూములివ్వని రైతుల భూములకు శనివారం ఆయన సాగునీటిని విడుదల చేశారు. రాజధాని పరిధిలోని నిడమర్రు ఎత్తిపోతల పథకం కింద 2700 ఎకరాలు సాగవుతోందని, ఎత్తిపోతల పథకానికి అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో రైతులు పంటలు పండించలేని పరిస్థితి నెలకొనగా ఎమ్మెల్యే ఆర్కే చొరవ తీసుకుని కోర్టును ఆశ్రయించి రైతులకు న్యాయం జరిగే విధంగా కృషి చేశారు. కోర్టు ఆదేశంతో ప్రభుత్వం కూడా వ్యవసాయాన్ని అడ్డుకోబోమని స్పష్టం చేసింది. దీంతో తొలగించిన విద్యుత్‌ను ఎత్తిపోతలకు పునరుద్ధరించారు. ఈ సందర్భంగా ఆర్కే సాగునీటిని విడుదల చేసి రైతులతో సమావేశమయ్యారు. ఎలాంటి ఆందోళన చెందకుండా వ్యవసాయం చేసుకోవాలని రైతులకు సూచించారు. రాజధాని నిర్మాణానికి తాము అడ్డుకాదని, రాజధాని నిర్మాణం పేరిట రైతులు, కూలీలకు, చేతివృత్తుల వారికి చేస్తున్న అన్యాయానికి మాత్రమే తాము వ్యతిరేకమని ఆయన అన్నారు. ఎంపిపి రత్నకుమారి, సర్పంచ్ మండెపూడి మణెమ్మ, ఎంపిటిసి సభ్యులు కె నాగరత్నం, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, గాదె వీరాంజనేయరెడ్డి, గాదె సాంబిరెడ్డి, తియ్యగూర శివన్నారాయణరెడ్డి, మండెపూడి యోహాను, గాదె లక్ష్మారెడ్డి, బి వేణుగోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.