గుంటూరు

డిపాజిట్ల సేకరణపై దృష్టిపెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 21: రైతులకు ఈ ఏడాది పెద్ద ఎత్తున రుణాల మంజూరు చేసిన నేపథ్యంలో డిపాజిట్ల సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడు ముమ్మనేని వెంకట సుబ్బయ్య పేర్కొన్నారు. శుక్రవారం బ్రాడీపేటలోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో జిల్లాలోని 36 బ్రాంచ్‌ల మేనేజర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఉద్యోగులకు బ్యాంకు ఎటిఎం కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అత్యధికంగా రుణాలు మంజూరు చేసేది మన బ్యాంకేనని, అయితే డిపాజిట్లు మాత్రం కమర్షియల్ బ్యాంకులకు తరలిపోతున్నాయని తెలిపారు. జిల్లావాసుల నుంచి సేకరించిన డిపాజిట్ల డబ్బును మన రైతులకే అందేలా చూడాలని తెలిపారు. కమర్షియల్ బ్యాంకుల్లో డిపాజిట్ల ధనం ఎక్కడో ముంబై, ఢిల్లీ, కోల్‌కత్తా వంటి ప్రాంతాల వారికి వెళ్లే అవకాశం ఉందని, ఈ విషయంపై గ్రామాల్లోని వారికి అవగాహన కల్పించి, డిపాజిట్లను పెంచేలా చూడాలన్నారు. తొలిసారిగా 9 శాఖల్లో జిడిసిసి బ్యాంకు ఎటిఎంలను ప్రారంభించామని, దీనిపై కూడా స్థానికంగా అవగాహన కల్పించి, ఖాతాలు ప్రారంభించేలా దృష్టిసారించాలన్నారు. ఈ సమావేశంలో బ్యాంకు సిఇఒ సుబ్రహ్మణ్యేశ్వరరావు, డిజిఎంలు భాను, ఫణి, ఎజిఎంలు అజయ్‌కిషోర్, జయలక్ష్మి, ఆయా బ్రాంచ్ మేనేజర్లు, నోడల్ అధికారులు పాల్గొన్నారు.