గుంటూరు

జగన్ మకాం ఇక్కడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 25: వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులోనే నివాసం ఏర్పాటుచేసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. కొద్దినెలల క్రితం వరకు రాజధాని ప్రాంతంలో విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో పార్టీ కార్యాలయంతో పాటు పార్టీ అధినేత నివాసానికి అనువైన ఇళ్లు, స్థలాలను పార్టీ నేతలు పరిశీలించారు. రాజకీయ పార్టీల కార్యాలయాలకు స్థల కేటాయింపులు జరుపుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జాబితాలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య స్థల వ్యత్యాసాల నేపథ్యంలో వైసిపి వ్యతిరేకించింది. పార్టీ పరంగా సొంత భవనాలను నిర్మించుకోవాలనే యోచనతో ఉన్నట్లు తెలిసింది. గుంటూరు ఇన్నర్ రింగురోడ్డు త్వరితగతిన అభివృద్ధి చెందుతోంది. ఈ ప్రాంతంలో పార్టీ కార్యాలయం ఏర్పాటుకు అనువుగా ఉంటుందని గుర్తించి నాలుగెకరాల స్థలాన్ని ఇటీవలే పరిశీలించారు. ఎకరం సుమారు రూ. 5 కోట్ల ధర పలుకుతోందని చెప్తున్నారు. అధికార తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం కూడా గుంటూరులోనే ఉన్నందున ఇక్కడే తాము కూడా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటుచేస్తే మంచిదనే భావనతో జగన్ ఉన్నట్లు తెలియవచ్చింది. ఇప్పటి వరకు లోటస్‌పాండ్ వేదికగా పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అధికార పార్టీ ప్రతి సందర్భంలో ఇదే అంశాన్ని లేవనెత్తుతోంది. ఈ పరిస్థితుల్లో రాజధాని ప్రాంతంలో ఉండటమే శ్రేయస్కరమని భావిస్తున్నట్లు సమాచారం. పార్టీ కార్యాలయంతో పాటు జగన్ ఉండేందుకు అవసరమైన ఇల్లును అద్దెకు తీసుకోవటమా లేక స్థలం కొనుగోలుచేయాలా అనే విషయాలను పరిశీలిస్తున్నారు. శాసనసభ సమావేశాలు ఇకపై ఇక్కడే ప్రారంభం కానున్న నేపథ్యంలో గుంటూరు కేంద్రంగా వైసిపి కార్యకలాపాలు నిర్వహించే అంశాన్ని పలువురు నేతలు జగన్ వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. గుంటూరులో ఉంటే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలతో పాటు సీమ ప్రాంతానికి చెందిన వారికి సౌలభ్యంగా ఉంటుందనే వాదనలు లేవనెత్తినట్లు చెప్తున్నారు. దీంతో గుంటూరులో మకాం వేసేందుకే జగన్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.