గుంటూరు

ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలు హక్కులకోసం పోరాడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), నవంబర్ 6: దేశంలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల హక్కుల కోసం దేశవ్యాప్తంగా ఉద్యమించాలని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ మాజీ ఉప కులపతి, పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక కొత్తపేటలోని మల్లయ్యలింగం భవన్‌లో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ సబ్‌ప్లాన్‌ను పూర్తిగా అమలు చేయాలని కోరుతూ జిల్లా సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యాన జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశానికి సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథి ఇనాక్ మాట్లాడుతూ దేశంలో సంపన్నులు సమాజాన్ని దోచుకుంటుంటే సామాన్యుడు పీడితుడుగా ఉండిపోతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంపన్న వర్గాల చేతిలో కీలుబొమ్మలుగా మారాయన్నారు. దేశంలో భిన్నమైన కులాలు, మతాలు, వర్గాలు ఉన్నా వారందరినీ కలిపే శక్తి లేదని, కేవలం అనైక్యత వలనే హక్కులను సాధించుకోలేక పోతున్నామన్నారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బిసి సబ్‌ప్లాన్ పూర్తిగా అమలు చేయడానికి, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ సాధనకు అన్ని సామాజిక శక్తులను ఒకే వేదికపైకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్థిక దోపిడీ లేని నవసమాజ స్థాపనకు అందరూ కంకణబద్దులు కావాలన్నారు. అధ్యక్షత వహించిన జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ హక్కుల సాధన కోసం పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఎఐటియుసి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, ఎమ్మెల్సీ పిజె చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు ప్రధాన పక్షాలు రెండు ప్రధాన కులాల చేతిలో ఉన్నాయని, ఆ రెండు పక్షాలు ఎస్సీ, ఎస్టీ, బిసిలను ఎదగనీయకుండా అణచివేతకు గురి చేస్తున్నాయని అన్నారు. సమావేశంలో ఆంధ్రపదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెల్ది విల్సన్, కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణమోహన్, దళిత హక్కుల సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి కనకరాజు ప్రసాద్, బిసి సంఘాల రాష్ట్ర కార్యదర్శి నరసింహారావు, వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రత్తిపాటి రోశయ్య, కోట మాల్యాద్రి, ఎం రమేష్, బైరాపట్నం రామకృష్ణ, పులి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.