గుంటూరు

ఎపిని కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), మే 9: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరవురహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలుగుదేశం పార్టీ జిల్లా ఇన్‌చార్జి గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ రాష్ట్రాన్ని స్మార్ట్ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఐదు గ్రిడ్‌లను చేపట్టిందన్నారు. కరవు రహిత రాష్ట్రంగా వాటర్‌గ్రిడ్ ధ్యేయమన్నారు. రాష్ట్రంలో నీటిసంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం జలసంరక్షణ, నీరు-చెట్టు ఉద్యమంగా తీసుకుని ప్రజల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున చేపడుతుందన్నారు. వాతావరణ మార్పులు, వర్షాభావ పరిస్థితుల వలన 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి రావడం లేదన్నారు. పెరిగిన వ్యవసాయం, పరిశ్రమలు, తాగునీటి అవసరాలకు భూగర్భజలాల వినియోగం అధిగమైందన్నారు. ప్రతివర్షపు నీటిచుక్కను సకాలంలో ఒడిసిపట్టి భూమిలో దాచుకోగలిగితే అవసరమైనప్పుడు బావులు, బోర్లద్వారా వినియోగించుకోవచ్చన్నారు. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయరంగం కుదేలైందని, అత్యంత ప్రాధాన్యతరంగమైన సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. కాంగ్రెస్ పాలనలో జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞంగా మార్చుకుని అవినీతికి పాల్పడ్డారన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రణాళకాబద్ధంగా సాగునీటి రంగానికి ప్రాధాన్యతనిచ్చిందన్నారు. నదుల అనుసంధానం, జలసంరక్షణ, భూసార పరీక్షలు, బిందుసేద్యం, పంట సంజీవని కార్యక్రమాలు చేపట్టామన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు జివి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రకృతి ప్రసాదించే వర్షం ద్వారా పునరుద్ధరించబడే సహజ సంపదే భూగర్భజలమన్నారు. రాష్టమ్రంతా ఒకటిగా నిలిచి వర్షపునీటి దాచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి మన్నవ సుబ్బారావు, పార్టీ నాయకులు దారపనేని నరేంద్ర, సుఖవాసి శ్రీనివాసరావు, మన్నవ సత్యనారాయణ, గుంటుపల్లి శేషగిరిరావు, కసుకుర్తి హనుమంతరావు, వెంకటేశ్వరెడ్డి తదితరులు పాల్గొన్నారు.