గుంటూరు

కు.ని. శస్తచ్రికిత్సలపై విస్తృత ప్రచారం నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 11: కుటుంబ నియంత్రణ శస్తచ్రికిత్సలు, జనాభా పెరుగుదల, అనర్ధాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని జాయింట్ కలెక్టర్-2 ముంగా వెంకటేశ్వరరావు కోరారు. సోమవారం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి వైద్యారోగ్యశాఖ ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ శాలినీదేవి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా చేపట్టిన కుటుంబ నియంత్రణ శస్తచ్రికిత్సల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపిన వైద్యారోగ్యశాఖలోని ప్రతి ఒక్కరికీ జిల్లా యంత్రాంగం తరపున అభినందనలు తెలియజేశారు. ఇదేస్ఫూర్తితో ప్రతియేటా గుంటూరు జిల్లాను అన్ని కార్యక్రమాల్లో ప్రథమస్థానంలో నిలిపేలా కృషిచేయాలని కోరారు. వరుసగా 6వ సారి ప్రథమస్థానం, అవార్డు పొందడం హర్షణీయమన్నారు. కుటుంబ నియంత్రణ శస్తచ్రికిత్సల్లో అధికభాగం మహిళలే కీలకపాత్ర పోషిస్తున్నారని, పురుషులు కూడా భాగస్వాములై వ్యాసెక్టమీ శస్తచ్రికిత్సకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని మగవారికి జనాభా పెరుగుదల నివారణకు కు.ని. దోహదం చేస్తుందన్న విషయంపై విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన వైద్యాధికారులు, ఎఎన్‌ఎంలు, ఆశాకార్యకర్తలకు వివిధ అంశాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలకు సర్ట్ఫికెట్లు, జ్ఞాపికలు అందజేశారు. కు.ని. శస్తచ్రికిత్సకు అంగీకరించి చికిత్స చేయించుకున్న దంపతుల్లో లాటరీ పద్ధతిన ఎంపిక చేసే ముగ్గురు దంపతులకు ఒక్కోక్కరికీ 10 వేల రూపాయల వంతున చెక్కులు అందజేశారు. తొలుత జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి కార్యాలయం నుండి ర్యాలీని జెసి-2 వెంకటేశ్వరరావు ప్రారంభించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి డిఎంహెచ్‌ఒ డాక్టర్ ఆర్ శ్యామల, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిణి డాక్టర్ సుహాసిని, అదనపు డిఎంహెచ్‌ఒ డాక్టర్ శారద, వైద్యాధికారులు, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.

కల్తీలకు పాల్పడే బహుళజాతి కంపెనీలను నియంత్రించాలి
గుంటూరు, జూలై 11: మార్కెట్‌పై గుత్త్ధాపత్యాన్ని కలిగిన బహుళజాతి కంపెనీలే స్వయంగా కల్తీ విత్తనాలు, పురుగుమందులు ఎరువులను విక్రయిస్తున్నాయని, అఖిలభారత రైతు-కూలీ సంఘం (ఎఐకెఎంఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల ప్రసాద్ ఆరోపించారు. కల్తీ విత్తనాలు, ఎరువులను నియంత్రించి బహుళజాతి కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం ఎఐకెఎంఎస్ ఆధ్వర్యాన నగరంలో ప్రదర్శన నిర్వహించి జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాలో మేకల ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ రైతులకు, కౌలు రైతులకు మేలురకం, ఎక్కువ దిగుబడినిచ్చే విత్తనాలను అందించే విధంగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదన్నారు. సంస్థకు అవసరమైనన్ని నిధులు కేటాయించక పోవడం వలన రైతులకు సరిపడా విత్తనాలు అందడం లేదని తెలిపారు. బహుళజాతి కంపెనీలు ఉత్పత్తిచేసిన నాశిరకం విత్తనాలను ప్రభుత్వమే అధిక ధరలకు రైతులకు విక్రయిస్తుందని ఆరోపించారు. కమీషన్లకు కక్కుర్తి పడుతున్న పాలకులు రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రతి సీజన్‌లో 38 కోట్ల ఎరువుల బస్తాలను రైతులు కొనుగోలు చేస్తున్నారని, ప్రతి బస్తాకు కొంతమేర ఎరువును తగ్గించి విక్రయిస్తుండటంతో రైతులకు సంబంధించి సుమారు 60 కోట్ల రూపాయలు కంపెనీలు, పాలకులు మింగేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కల్తీలు విక్రయిస్తున్న వారిపై ఎటువంటి కేసులు నమోదు చేయడం లేదని ఆరోపించారు. అంతకముందు గుంటూరు రైల్వేస్టేషన్ నుండి నాజ్‌సెంటర్, జిన్నాటవర్ సెంటర్, హిందూ కళాశాల పోలీసు పెరెడ్‌గ్రౌండ్ మీదుగా జిల్లా పరిషత్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో ఎఐకెఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఇందుర్తి సుబ్బయ్య, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసి నాయకులు బెజ్జం శ్రీనివాసరావు, ఎఐకెఎంఎస్ జిల్లా కోశాధికారి పోతురాజు, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎన్ విష్ణు, శీలం ఏసమ్మ, నాయకులు శివపార్వతి, ఎంపి రంజాన్, పి బాబు, పి గోపయ్య తదితరులు పాల్గొన్నారు.

మూడేళ్లలో పోలవరం పూర్తి: జీవీ
గుంటూరు, జూలై 11: రానున్న మూడేళ్ల కాలంలో పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు జివి ఆంజనేయులు అన్నారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా 74 లక్షల మొక్కలు నాటి ఎపిని హరితాంధ్రగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 70 శాతం వరకు అమలు చేసిన ఘనత టిడిపికే దక్కుతుందన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలతో పాటు 24 వేల కోట్ల రూపాయల రైతుల రుణాలను మాఫీ చేశామన్నారు. ఐదు నెలల్లో పట్టిసీమ పూర్తిచేసి 8.5 లక్షల ఎకరాల్లో పంట పొలాలను కాపాడామన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన అంశాలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు. కాపులను బిసిల్లో చేరుస్తామని, పది లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, 9 గంటల ఉచిత్ విద్యుత్ వంటి హామీలు గుప్పించి ఏ ఒక్కటీ ఆచరణలో పెట్టలేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక నిరంతర విద్యుత్‌తో పాటు రైతులకు సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు ఇచ్చి రైతుల ఆత్మహత్యలను నివారించినట్లు వివరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకున్న పాపానపోలేదన్నారు. పొరుగు రాష్ట్రాలు సైతం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని చూసి ఆశ్చర్య పోతున్నాయన్నారు. మార్కెట్‌యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన వలన రాష్ట్రంలో పెట్టుబడి దారులు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారన్నారు. ప్రతిపక్షం ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం తప్ప ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్రమం గానీ, సూచనలు గానీ చేయడం లేదన్నారు. తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి మద్దాళి గిరిధర్ మాట్లాడుతూ కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని నగర కార్పొరేషన్ 180 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టిందన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు లాల్‌వజీర్, హర్షవర్ధన్, చంద్రగిరి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.
మహిళా సాధికారతే
టిడిపి ధ్యేయం
విలేఖర్ల సమావేశం అనంతరం ఎమ్మెల్యే జివి ఆంజనేయులు జిల్లా తెలుగు మహిళా కార్యవర్గ సమావేశానికి హాజరై మాట్లాడారు. మహిళా సాధికారతే తెలుగుదేశం ధ్యేయమన్నారు. జిల్లా తెలుగుమహిళా అధ్యక్షురాలు కేశనశెట్టి రమాశాంతదేవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నల్లపనేని విజయలక్ష్మి, భీమినేని వందనాదేవి, బత్తుల రమణమ్మ, ఎన్ పద్మలత, ఉప్పలమర్తి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.