గుంటూరు

ప్రభుత్వ పథకాలు ప్రజలదరిచేరాలి: జీవీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), జూలై 25: రాష్ట్రప్రభుత్వం పేద, బడుగు, బలహీనవర్గాలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరి దరిచేర్చేలా కార్యకర్తలు, నాయకులు కృషిచేయాలని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జివి ఆంజనేయులు కోరారు. సోమవారం బృందావనగార్డెన్స్‌లోని జిల్లా పార్టీ కార్యాలయంలో విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ గత రెండు రోజులుగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు నిర్వహించామని, కార్యకర్తల సూచనలు పార్టీకి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. కార్యకర్తలకు న్యాయం జరిగే విధంగా నామినేటెడ్ పోస్టుల భర్తీల్లో అవకాశం కల్పిస్తామన్నారు. రానున్న గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు కానుకగా ఇస్తామన్నారు. వైసిపికి రాజకీయ భవిష్యత్తు కనుమరుగు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. పార్టీనాయకులు కంచర్ల శివరామయ్య, మానుకొండ శివప్రసాద్, మన్నవ కోటేశ్వరరావు, సుఖవాసి శ్రీనివాసరావు, మీరావలి, పానకాల వెంకట మహాలక్ష్మి, ములకా సత్యవాణిరెడ్డి పాల్గొన్నారు.
ఎస్‌పి గ్రీవెన్స్‌లో
ముగ్గురి ఆత్మహత్యాయత్నం
* న్యాయం జరగడం లేదంటూ ఎలుకల మందు తిన్న వైనం
గుంటూరు, జూలై 25: గుంటూరు అర్బన్ ఎస్‌పి కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్‌లో నగరానికి చెందిన ఒకే కుటుంబానికి సంబంధించిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యకు యత్నించారు. వివరాల్లోకి వెళితే... నగరంలోని బొంగరాలబీడు 2వ లైనులో నేలపాటి నిర్మల అనే మహిళ తన ఇంటిని అదే ప్రాంతానికి చెందిన అంబేద్కర్‌కు ఏడాది క్రితం లక్ష రూపాయలకు తాకట్టుపెట్టింది. నెల రోజుల క్రితం ఇంటిని విడిపించుకునేందుకు అంబేద్కర్ వద్దకు వెళితే 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో నిర్మల స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. అయితే పోలీసులు పట్టించుకోక పోగా అంబేద్కర్‌కే అండగా నిలుస్తున్నారని ఆరోపిస్తూ సోమవారం ఎస్‌పి ఆఫీసులో ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. నిర్మలతో పాటు ఆమె కుమారుడు భానుప్రకాష్, ఆమె అక్క కుమార్తె కుమారి ఎస్‌పి ఆఫీసుకు వచ్చారు. గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసిన అనంతరం తమకు న్యాయం చేయాలని పెద్దపెట్టున అరుస్తూ తమ వెంట తెచ్చుకున్న ఎలుకల మందు తిని ఆత్మహత్యకు యత్నించారు. ఒక్కసారిగా సిబ్బంది అప్రమత్తమై ముగ్గురినీ హుటాహుటిన గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
భారీవర్షంతో వీధులు జలమయం
మంగళగిరి, జూలై 25: పట్టణంలో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ప్రధాన వీధులన్నీ జలమయమయ్యాయి. అనేక వీధుల్లో డ్రైనేజీలు పొంగి మురుగునీరు, వర్షపునీరు రోడ్లపై ప్రవహించాయి. అరగంటసేపు ఎడతెరిపిలేకుండా భారీవర్షం కురిసింది. శివారు ప్రాంతాల్లో నివాసాల మధ్యకు నీరుచేరింది. వర్షం కురవడంతో చిరువ్యాపారులు ఇబ్బంది పడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో కురిసిన వర్షం మెట్టపైర్లకు మేలుచేస్తుందని రైతులు ఆనంద భరితులయ్యారు.