గుంటూరు

టీడీపీతోనే రైతుల జీవనం మెరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిలకలూరిపేట, డిసెంబర్ 28: తెలుగుదేశం పార్టీతోనే రైతుల జీవన ప్రమాణాలు మెరుగు పడతాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. సోమవారం చిలకలూరిపేట పట్టణంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనల్లో ఆయన పాల్గొన్నారు. 16వ వార్డులోని చిన్నరథం సెంటర్ నుంచి గడియారస్తంభం వరకు 16 లక్షల రూపాయలతో నిర్మించే డ్రెయిన్‌ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 7వ వార్డులో 8.80 లక్షల రూపాయల ప్రణాళికతో సిసి రోడ్డు, 5.50 లక్షల రూపాయలతో సిసి కాల్వలకు శంకుస్థాపన చేశారు. వీటితో పాటు పట్టణంలో పలు సిసి రోడ్లు, కాల్వల శంకుస్థాపనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ పరిధిలో నిరుపేదలైన ఇళ్లులేని వారికి జిప్లస్ 2 పద్ధతిలో 4,500 ప్లాట్లు కేటాయిస్తున్నామన్నారు. అమృత్ పథకం కింద నిర్మించనున్న ఈ భవన సదుపాయాలకు జనవరి నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తున్నట్లు తెలిపారు. ఇవేకాక 300 కోట్ల రూపాయలతో పట్టణంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టేందుకు కార్యాచరణ చేపట్టామన్నారు. స్థానిక బంగారం కొట్లబజారును మంత్రి పరిశీలించారు. అనంతరం మంత్రి పుల్లారావును టిఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు కలిసి సత్కరించారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ గంజి చెంచుకుమారి, కమిషనర్ కనకారావు, కౌన్సిలర్లు మద్ది వెంకటప్పారావు, దేవికుమారి, విడదల లక్ష్మీనారాయణ, టిడిపి నాయకులు షేక్ అబ్దుల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.

ఆద్యంతం ఆలోచింపజేసిన ‘అనంతం’ నాటిక
తెనాలి, డిసెంబర్ 28: తెనాలిలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఆహ్వాన సాంఘీక నాటిక పోటీలలో భాగంగా సోమవారం ప్రదర్శించిన ‘అనంతం’ నాటికి ఆద్యంతం ప్రేక్షకులు ఆలోచింపజేసింది. రంగయాత్ర గుంటూరువారి ఆధ్వర్యంలో గంధం నాగరాజు రచనలో శ్రీకరణం సురేష్ దర్శకత్వంలో కొనసాగిన ‘అనంతం’నాటిక ప్రజల మనోభావాలను ఎంతో అలోచింపజేసింది. అనంతరం పద్మభూషణ్ గుర్రం జాషువా స్మారక కళాపరిషత్ దుగ్గిరాల వారి సారధ్యంలో డాక్టర్ పెద్దీటి యోహాను రచనలో డాక్టర్ అయినాల మల్లేశ్వరావు దర్శకత్వంలో ప్రదర్శించబడిన ‘ఏంటి ? ఇది నిజామా ’ నాటిక సాంఘీక జీవన శైలిని సుస్పష్టంగా తెలియజేసింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకరరావు, బెల్లంకొండ వెంకటేష్, చెరుకుమల్లి సింగారావు, ఈదర శ్రీనివాసరావు, మాదల కోటేశ్వరరావు, తాడిబోయని శ్రీనివాసరావు, ముదిగొండ శైలజ, గుమ్మడి రాంబాబు, ఎండి నియాజుద్దీన్, ఎన్‌పివి మల్లిఖార్జునరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పలువురు రంగస్థల, సాంఘీక నాటకాల నటులను ఘనంగా సత్కరించారు.

ఐటా టెన్నిస్ పోటీల విజేతలు ప్రగతీష్, చంద్రకళ
గుంటూరు (స్పోర్ట్స్), డిసెంబర్ 28: ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ టాలెంట్ టెన్నిస్ అండర్-12 బాలుర విభాగంలో తమిళనాడుకు చెందిన ప్రగతిష్, శివశంకర్, బాలికల విభాగంలో టింటు శ్రీ చంద్రకళ విజేతలుగా నిలిచారు. రన్నర్స్ టైటిల్స్‌ను బాలుర విభాగంలో కర్ణాటకకు చెందిన స్కందన శివశంకర్, బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లేళ్ల అశ్రీత కైవసం చేసుకున్నారు. బాలుర డబుల్స్ విభాగంలో ప్రణవ్‌కార్తీక్, ప్రగతిష్ శివశంకర్ జంట విన్నర్స్‌గానూ, స్కందన ప్రసన్నకుమార్, ధృవ్ అద్వత్ జంట రన్నర్స్ టైటిల్స్ సాధించగా, బాలికల విభాగంలో శ్రీ చంద్రకళ, ఎన్ కృష్ణవేణి విన్నర్స్‌గా, డి సాత్విక, బి ఫర్కాన్ ముస్కాన్‌ల జంట రన్నర్స్‌గా నిలిచారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి నిట్ డైరెక్టర్ ఫణిరామ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి విజేతలకు ప్రశంసా పత్రాలు, ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌టిఆర్ స్టేడియం ఆధ్వర్యంలో జాతీయ స్థాయి టెన్నిస్ టాలెంట్ సిరీస్ పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ అవకాశాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎన్‌టి ఆర్ స్టేడియం కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు, జిల్లా టెన్నిస్ సంఘ కార్యదర్శి కెఎస్ చారి, ఎస్‌ఎన్ కమాల్, రమేష్, సతీష్, ఎన్‌టి ఆర్ స్టేడియం శిక్షకుడు జివి ఎస్ ప్రసాద్, రిఫరీ శ్రీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.