గుంటూరు

సంగీత ప్రపంచంలో మేలిమిరత్నాలు మన వాగ్గేయకారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), అక్టోబర్ 22: సమాజంలో ధార్మిక చింతన, భక్తితత్పరతను పెంపొందింపజేస్తూ తమ కృతిసాహిత్యాన్ని తన ఆరాధ్యదైవాలకు పుష్పమాలికల్లా సమర్పించిన మన వాగ్గేయకారులు సంగీత ప్రపంచాన మెలిమి రత్నాలని పలువురు సంగీత విద్వాంసులు అంజలి ఘటించారు. నగరంలోని బ్రాడీపేట శ్రీ సిద్ధేశ్వరీపీఠ దత్తత ఓంకారక్షేత్రం వేదికగా శనివారం రాత్రి గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు సంగీత మహోత్సవాలు వేడుకగా ప్రారంభమైనాయి. క్షేత్ర కార్యదర్శి ఎన్ నారాయణమూర్తి తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలకు శుభారంభం పలికారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ టి సూర్యకాంతం, ప్రధాన కార్యదర్శి ఎంవై శేషురాణి, నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన కళాకారులు వాగ్గేయకారుల చిత్రపటాలకు పుష్పాంజలి సమర్పించారు. అనంతరం జరిగిన సభలో సూర్యకాంతం మాట్లాడుతూ కర్ణాటక సంగీతానికి వైవిధ్యాన్ని తెచ్చిపెట్టిన మహనీయులు మన వాగ్గేయకారులేనన్నారు. ఈ ఉత్సవంలో భాగంగా విశాఖ నగరం నుంచి విచ్చేసిన యువ ప్రతిభావంతురాలు మండా శృతిరవళికి సన్మండలి పక్షాన సూర్యకాంతం, శేషురాణి, ఇతర కార్యవర్గ సభ్యులు విలువైన తంబూరాను ప్రదానం చేశారు. గాయని శృతిరవళి కృతజ్ఞతాపూర్వకంగా ప్రసంగిస్తూ ఇంతవరకు ఎన్నో అవార్డులు అందుకున్నా భగవంతుడికి, ముఖ్యంగా శృతి, లయ జ్ఞానానికి అత్యంత ఉపయోగపడే తంబూరాను తనకు బహుమతిగా అందజేసిన సన్మండలి కార్యవర్గానికి ధన్యవాదాలు తెలిపారు. సభానంతరం రవళి తన గాత్ర మాధుర్యంతో రసజ్ఞులైన శ్రోతలను పరవశింపజేశారు. జ్ఞానదేవ్ చెన్నై వయోలిన్‌పై, విష్ణ్భుట్ల అరవింద్ విజయవాడ, మృదంగంతో వాద్య సహకారాన్ని అందించారు. ఈ కార్యక్రమాలను వ్యాపారవేత్త మాణిక్యవేల్, ఎం శారదాగోవిందరాజులు సమర్పించారు.