గుంటూరు

ప్రజలకు అందుబాటులోకి పాలనను ఓర్వలేకపోతున్న జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), అక్టోబర్ 22: పరిపాలనా సౌలభ్యంతో పాటు ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 8 నెలల్లోనే రాజధాని అమరావతిలో సచివాలయాన్ని నిర్మించి, ప్రజాసంక్షేమ పాలన సాగిస్తుంటే ప్రతిపక్ష నేత జగన్ చూసి ఓర్వలేక పోతున్నారని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. శనివారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నోటుకు ఓటు కేసుకు భయపడి హైదరాబాద్‌లోని ఎపికి కేటాయించిన సెక్రటేరియట్ భవనాన్ని తెలంగాణకు అప్పగిస్తున్నారనే వైసిపి నేతల విమర్శలు అర్థరహితమన్నారు. మన ప్రాంతం నుండే పాలన జరగాలన్న లక్ష్యం, టిఆర్‌ఎస్ ప్రభుత్వం మన ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బందులకు గురిచేస్తున్న విషయాన్ని గుర్తెరిగి ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుచూపుతో వెలగపూడిలో సచివాలయాన్ని నిర్మించారన్నారు. ఈ ప్రాంతానికి సచివాలయం రావడంతో జగన్ హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌ను వదిలి వచ్చేందుకు ఇష్టపడటం లేదన్నారు. కెసిఆర్‌తో లాలూచీపడిన జగన్ తన అనుయాయులకు కాంట్రాక్టులు ఇప్పించుకున్నారన్నారు. ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ప్రభాకర్ మాట్లాడుతూ కాపుల కోసం నిర్వహించిన జాబ్‌మేళాకు 10 వేల మంది హాజరుకాగా 3 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించడం జరిగిందన్నారు. మంజునాధ కమిషన్‌ను ఏర్పాటుచేయడం, కాపు కార్పొరేషన్‌కు వెయ్యి కోట్లు మంజూరు చేయడం, ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థులతో సమానంగా కాపు విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం కాపులను విస్మరించి నేడు కపటప్రేమ వొలకబోస్తుందన్నారు.