గుంటూరు

అంగన్‌వాడీల తొలగింపును నిరసిస్తూ ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కార్పొరేషన్), డిసెంబర్ 28: న్యాయపరమైన హక్కుల కోసం ఆందోళన చేసిన అంగన్‌వాడీలను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోకు వ్యతిరేకంగా అఖిలపక్ష రాజకీయ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సోమవారం అఖిల పక్ష రాజకీయ పార్టీలు, కార్మిక, దళిత, బిసి సంఘాల ఆధ్వర్యంలో నోటికి నల్లబ్యాడ్జీలను ధరించి స్థానిక శంకర్‌విలాస్ సెంటర్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కె ఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ అంగన్‌వాడీల తొలగింపు జీవోను ఉపసంహరించకపోతే తాము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై నేతాజి, వైఎస్‌ఆర్ సిపి రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి , ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణమూర్తి, సిపిఎం జిల్లా కార్యదర్శి రామారావు, పి ఓడబ్ల్యూ అధ్యక్షులు విష్ణు, ఎమ్మార్పీ ఎస్ జిల్లా అధ్యక్షులు మోహన్‌మాదిగ, సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి, యుటి ఎఫ్, సూరీడుపార్టీ, డిటి ఎఫ్ తదితర పార్టీల నాయకులు పాల్గొన్నారు.

తప్పుల్లేకుండా జనాభా లెక్కలు సేకరించాలి
గుంటూరు (కార్పొరేషన్), డిసెంబర్ 28: జాతీయ జనాభా రిజిస్టర్ కార్యక్రమంలో భాగంగా జనాభా లెక్కలను తప్పులు లేకుండా సేకరించాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ నాగలక్ష్మి తెలిపారు. సోమవారం స్థానిక నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశమందిరంలో ఎస్‌ఎల్‌ఎఫ్‌లు, ఆర్‌లతో జాతీయ జనాభా రిజిస్టర్ కార్యక్రమంపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి 150 నుండి 200 ఇళ్లను జనాభా లెక్కల కోసం కేటాయిస్తామని, వారి నుండి తప్పనిసరిగా ఆధార్‌కార్డును సేకరించాలన్నారు. నగరంలో వందకు పైగా గుర్తించిన స్లమ్‌లు ఉన్నాయని వాటిలో నివసించే పేద వారిని గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలు లబ్ధిచేకూరేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్యాసులేని వారికి గ్యాస్ కనెక్షన్లు, డ్వాక్రా గ్రూపులలో మహిళలను చేర్పించి బ్యాంకుల నుండి రుణం పొందే అవకాశాలను వారికి వివరించాలన్నారు. అలాగే జనవరి 2వ తేదీ నుండి 11వ తేదీ వరకు జన్మభూమి 3వ విడత కార్యక్రమం జరగనుందన్నారు సమావేశంలో డిప్యూటీ కమిషనర్ ఏసుదా సు, పిఓ సింహాచలం, సెక్రటరీ వసంతలక్ష్మి, సిఓలు, ఆర్‌పిలు, సిబ్బంది పాల్గొన్నారు.

విలక్షణ హాస్యకావ్యం భలే మంచిరోజు

గుంటూరు (పట్నంబజారు), డిసెంబర్ 28: విలక్షణమైన కథనానికి వినోదాన్ని మేళవించి రూపొందించిన చిత్రం భలే మంచిరోజు చిత్రమని చిత్ర కథానాయకుడు సుధీర్‌బాబు పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం పల్లవి థియేటర్‌లో వెంకటేశ్వర ఫిలింస్, ఇవివి యువ కళావాహినిల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన భలే మంచిరోజు చిత్ర యూనిట్ విజయోత్సవ యాత్రలో ఆయన మాట్లాడారు. కార్యక్రమానికి కళావాహిని అధ్యక్షుడు వెచ్చా కృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ కథనం పాత్రల రూపకల్పన వినూత్నంగా ఈ చిత్రంలో ఉందన్నారు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ వినూత్న క్రైమ్ కామెడి చిత్రానికి అన్నివర్గాల ప్రేక్షకుల ప్రశంసలు లభిస్తున్నాయన్నారు. కథానాయిక వామిక మాట్లాడుతూ భలే మంచి రోజు మంచిపాత్రతో నటిగా తనకు గుర్తింపు నిచ్చిందన్నారు. అనంతరం వెచ్చా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో చిత్రయూనిట్‌ను పంపిణీదారుల ప్రతినిధి శంకర్, వెంకటేష్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చిత్ర తారాగణం డ్యాన్సులతో, డైలాగులతో అలరించారు. తొలుత చిత్రయూనిట్‌కు పల్లవి అధినేత నల్లూరి వెంకటేష్ ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో సినీ పంపిణీదారుల ప్రతినిధులు శంకర్, నాగరాజులతో పాటు రామిరెడ్డి, రామకృష్ణ, కనకారావు తదితరులు పాల్గొన్నారు.