గుంటూరు

చదువు, ఆట పాటలతో ఎగ్జిబిషన్లూ ఎంతో ఉపయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడికొండూరు, నవంబర్ 28: చదువు, ఆటపాటలతో పాటు సైన్స్ ఎగ్జిబిషన్‌లు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. మండలంలోని పేరేచర్లలో ఇంటల్ పబ్లిక్‌స్కూలులో ఏర్పాటుచేసిన సైన్స్ ఎగ్జిబిషన్‌ను శనివారం ఆయన సందర్శించారు. పారిశ్రామిక కేంద్రమైన పేరేచర్లలో కాలుష్య నివారణ కోసం పాఠశాల ఆవరణలో చెట్లు పెంచి పచ్చదనాన్ని పెంపొందించేందుకు స్కూలు యాజమాన్యం చేపట్టిన చర్యలను అభినందించారు. సైన్స్ ఎగ్జిబిషన్‌ల వంటి చైతన్య కార్యక్రమాలు ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ విజయకుమార్ రాణి, విజయ్‌కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యుదాఘాతంతో యువకుని దుర్మరణం
* గుణపాఠం నేర్వని విద్యుత్‌శాఖ
పెదనందిపాడు, నవంబర్ 28: స్తంభం ఎక్కి పనిచేస్తున్న యువకుడు విద్యుత్‌షాక్‌కు గురై దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని అన్నవరంలో శనివారం జరిగింది. గత అనుభవాలతో గుణపాఠాలు నేర్వని విద్యుత్‌శాఖ అదేక్రమంలో మరో యువకుని నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. రెండు రోజుల క్రితం లో- ఓల్టేజ్ సమస్యను నివారించే క్రమం లో 500 కెవి ట్రా న్స్‌ఫార్మర్‌ను వి ద్యుత్‌శాఖ గ్రా మంలో ఏర్పాటుచేసింది. ఈ తరుణంలో జంగా అశోక్ అనే యువకుడిని లైన్‌మెన్ నాయక్ స్తంభం ఎక్కించి వైర్ బిగించే పని చేయిస్తున్నారు. వెల్‌సి తీసుకోకుండా పనిచేస్తుండటంతో ఒక్కసారిగా కరెంట్ రావడంతో షాక్‌కు గురై అశోక్ స్తంభం పైనుండి కిందపడి మృతిచెందాడు. శుక్రవారం హై ఓల్టేజ్ రావడంతో పలు ఇళ్లలో గల టీవీలు, ట్యూబ్‌లైట్లు, ఫ్రిజ్‌లు మాడిపోయాయి. దీంతో వేలాది రూపాయల నష్టం వాటిల్లింది. ఈ వరుస సంఘటనలు గ్రామంలో కలకలం సృష్టించాయి. విషయం తెలిసిన లైన్‌మెన్ పరారీలో ఉన్నారు. గతంలో పెదనందిపాడు, పాలపర్రులో ఇదేవిధంగా నలుగురు వ్యక్తులు మృతిచెందారు. మరో ఇద్దరు యువకులు అంగవైకల్యంతో మంచానికే పరిమితమై ఇబ్బందులు పడుతున్నారు. వేలాది రూపాయలు జీతాలుగా తీసుకునే ఉద్యోగులు మాత్రం ప్రైవేటు వ్యక్తులతో పనిచేయిస్తూ ప్రమాదాలు వాటిల్లినప్పుడు డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడం షరామామూలేనని విద్యుత్ వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులతో పనిచేయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. కుమారుని మృతదేహం వద్ద అతని తల్లి రోదిస్తున్న తీరు పలువురిని కలచివేసింది. ఈ విషయమై నోరుమెదపడానికి విద్యుత్‌శాఖ అధికారులు నిరాకరించారు.

రహదారుల విస్తరణ వద్దని కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం
మంగళగిరి, నవంబర్ 28: ప్రభుత్వం 2006లో ఆమోదించిన అప్పటి విజిటియం ఉడా తయారు చేసిన జోనల్ డెవలప్‌మెంట్ ప్లాన్ ప్రకారం మంగళగిరి పట్టణంలో రోడ్లను విస్తరించ వద్దని ప్రభుత్వాన్ని కోరుతూ శనివారం నాడిక్కడ జరిగిన మంగళగిరి మున్సిపల్ అత్యవసర సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. సమావేశానికి మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి అధ్యక్షత వహించారు. ప్రభుత్వం ఆమోదించిన ప్లాన్ ప్రకారం మంగళగిరి పట్టణంలో 14 రోడ్లను విస్తరించాల్సి ఉందని, తొలి విడతగా తెనాలిరోడ్డును విస్తరించేందుకు కార్యాచరణ ప్రారంభించామని అధికారులు పేర్కొన్నారు. గత మే 30న జరిగిన కౌన్సిల్ సమావేశం చేసిన తీర్మానం ప్రకారం విస్తరణకు శ్రీకారం చుట్టామని అధికారులు పేర్కొనగా ఆ తీర్మానం పునఃపరిశీలనకు అఖిలపక్ష సభ్యులు కోరడంతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మహమ్మద్ రఫి (కాంగ్రెస్), సంకే సునీత (వైఎస్‌ఆర్‌సీపీ), వి జవహర్‌లాల్ (సిపిఎం), వి ఆషాబాల (టిడిపి), గోలి నాగశ్రీనివాస్ (టిడిపి), వైస్‌చైర్మన్ సంకా బాలజీగుప్తా (టిడిపి) మాట్లాడుతూ ఈ ప్రాంతం రాజధాని అయినప్పటికీ మరో పదేళ్ల వరకు ఆ ప్రభావం ఉండే అవకాశం లేదని, కనుక ఇప్పుడే రోడ్డు విస్తరణ అవసరం లేదని, ప్రజలు నష్టపోయేలా విస్తరణ చేయవద్దని ఈ మేరకు తీర్మానం చేయాలని ఏకగ్రీవంగా కోరారు. పోలీసు, ఆర్‌టిసి వారితో ఉన్న మున్సిపల్ అధికారుల సంబంధాల మేరకు రోడ్ల విస్తరణకు శ్రీకారం చుట్టారని బాలాజీగుప్తా తదితరులు ఆరోపించారు. కొన్ని రోడ్లలో అవసరం లేకపోయినా విస్తరిస్తున్నామని, మార్కింగ్ ఇవ్వటం జరుగుతుందని, ఫలితంగా దళారులు రంగ ప్రవేశం చేసి డబ్బులు వసూలు చేస్తున్నారని, ఈ వ్యవహారమంతా కౌన్సిల్‌కు చెడ్డపేరు తెస్తోందని, టౌన్‌ప్లానింగ్ అధికారులు ఈ పనులు మానుకోవాలని ఆయన అన్నారు. అంతకు ముందు జరిగిన కౌన్సిల్ మరో అత్యవసర సమావేశంలో పందులు, కుక్కలు విచ్చల విడిగా తిరుగుతున్నా పట్టించు కోవడం లేదని, పారిశుద్ధ్య సమస్యపై సభ్యులు ధ్వజమెత్తారు. చెత్త తొలగించే 8 ఆటోలు రిపేరులో ఉన్నాయని అధికారులు చెప్పడంతో వారిపై చైర్మన్ చిరంజీవి మండిపడ్డారు.