గుంటూరు

యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 21: అతిసార ప్రబలిన ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు చేపట్టి పూర్తిచేసేందుకు ఇతర మునిసిపాలిటీల నుంచి కార్మికులను రప్పించామని ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని రాష్ట్ర మంత్రులు పి నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. బుధవారం మంత్రులు నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీకేష్ బి లత్కర్‌తో కలసి నగరంలోని చంద్రబాబునాయుడు కాలనీ, ఆనందపేటలో పర్యటించి పారిశుద్ధ్య, అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీజీహెచ్‌కు డయేరియా కేసులు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. పరిస్థితి పూర్తిస్థాయిలో అదుపులో ఉందని, సంఘటన జరిగిన వెంటనే నగరపాలక సంస్థ, వైద్య, ఆరోగ్య, రెవిన్యూ అధికారులతో కలసి వైద్య శిబిరాలను ఏర్పాటుచేసి బాధితులకు అత్యవసర చికిత్స అందించామన్నారు. నగరంలోని అన్ని రిజర్వాయర్లు, పైపులైన్లకు సూపర్ క్లోరినేషన్ చేయించామని వివరించారు. నెలాఖరు నాటికి 23 కిలోమీటర్ల మేర పైపులైన్లను మార్చే పనులు పూర్తవుతాయని చెప్పారు. ఎప్పటికప్పుడు నివేదికలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు పంపుతున్నామని ఆయన ఆదేశాల మేరకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి మద్దాళి గిరిధర్, నగరపాలక సంస్థ ఎస్‌ఈ డి మరియన్న, ఈఈలు రాంనాయక్, వెంకటేశ్వరరావు, నగేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.