గుంటూరు

ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అమరావతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 24: పర్యాటక కేంద్రంగానూ, పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న అమరావతిని రానున్న రోజుల్లో ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్రప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి సారిగా అమరావతికి విచ్చేసిన శశిధర్‌కు సాంఘిక సంక్షేమ శాఖ జెడి ధ్యానబుద్ధ ప్రాజెక్టు వద్ద పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ధ్యానబుద్ధ ప్రాజెక్టు, ఘాట్ పరిసర ప్రాంతాలను పర్యాటక శాఖ ఎండి హిమాన్షు శుక్లాతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శశిధర్ విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తుందని ధ్యానబుద్ధ ప్రాజెక్టు ఎదురుగా గల 17 ఎకరాల స్థలాన్ని భూ సేకరణ కింద తీసుకున్నామని, ఆయా లబ్ధిదారులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 17.47 కోట్ల రూపాయలు కేటాయించామని, త్వరలో ఆయా లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందన్నారు. ధ్యానబుద్ధ ప్రాజెక్టు ఎదురుగా గల స్థలాన్ని థీంపార్క్‌గా అభివృద్ధి చేయడంతో పాటు బుద్ధిస్ట్ మానిస్టరీలను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రసాద్ పథకం కింద 27 కోట్లు మంజూరు కాగా 22 కోట్లు ఖర్చు చేశామని, హృదయ్ పథకం కింద 17 కోట్లు మంజూరు కాగా 12 కోట్లు ఖర్చు చేశామని, వీటితో పాటు స్వదేశీ దర్శని పథకం కింద 17 కోట్లు త్వరలో మంజూరు కానున్నాయన్నారు. వీటన్నింటితో ధ్యానబుద్ధ ప్రాజెక్టు, నూనెగుండెం ప్రాజెక్టు, అమరేశ్వర స్వామి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. తొలుత అమరావతికి విచ్చేసిన కలెక్టర్ శశిధర్ అమరావతిలో, ధ్యానబుద్ధ ప్రాజెక్టు, ఘాట్ వద్ద, పారిశుద్ధ్య చర్యలు సక్రమంగా లేవని అమరావతి, ధరణికోట పంచాయతీ కార్యదర్శులను మందలించారు. శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ నూనెగుండం చెరువు, అమరేశ్వరాలయాలను తిలకించారు. ఆయన వెంట గుంటూరు ఆర్డీవో బండ్ల శ్రీనివాసరావు, తహశీల్దార్ భాస్కరరావు, ఎండివో వై రాజగోపాల్, ఇఒఆర్‌డి పెండ్యాల శివరామయ్య, మండల పరిధి గ్రామాల కార్యదర్శులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

నవమి వేడుకలకు సర్వం సిద్ధం
* 25, 26 తేదీల్లో ఆగమోక్తంగా కల్యాణోత్సవాలు
గుంటూరు (కల్చరల్), మార్చి 24: సత్యధర్మ పరాయణుడైన రామచంద్రమూర్తి, జనక మహారాజు గారాలపట్టి సీతామహాసాధ్వీల కల్యాణోత్సవాన్ని కనుల పండువగా జరుపుకోవడానికి గుంటూరు నగరంలోని 52 డివిజన్లలో గల ప్రధాన రామ మందిరాలు ముస్తాబైనాయి. ఈ సందర్భంగా నగరంలోని ఆర్ అగ్రహారం సంపత్‌నగర్‌లో కొలువైయున్న ప్రసిద్ధ శ్రీరామనామ క్షేత్రంలో నవమి వేడుకలను ఐదు రోజుల పాటు నిర్వహించడానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. ఆదివారం నాడు పలు దేవాలయాల్లో నవమి ప్రారంభమవుతున్న సందర్భంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించడానికి ఆయా దేవాలయాలు, మందిరాల భక్తబృందాలు సిద్ధమైనాయి. మరికొన్ని దేవాలయాల్లో మిగులును ప్రాధాన్యంగా తీసుకుని సోమవారం నాడు కల్యాణోత్సవాలు జరుపుకోనున్నారు. బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి ఆలయం, మారుతీక్షేత్రం, కోదండ రామమందిరాలు, కొరిటెపాడు, కాలనీ, పట్ట్భాపురం, రవీంద్రనగర్, పాత గుంటూరు, అమరావతి రోడ్డు తదితర ప్రాంతాల్లోని ఆలయాల్లో వసంత నవరాత్రులు, అలాగే నవమి వేడుకలను ఒకే వేదికపై ఐదు రోజుల పాటు జరుపుకోనున్నారు. ఉత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్య ఆలయాలను విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా అలంకరించారు.