గుంటూరు

ప్రజాసంకల్ప యాత్రలో అడుగడుగునా జగన్‌కు నీరాజనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసరావుపేట, మార్చి 24: వైఎస్సార్‌సీపీ నాయకుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శనివారం చిలకలూరిపేట నియోజకవర్గంలోని కావూరు గ్రామంలో ఉదయం 8.40గంటలకు ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభమైంది. 11గంటలకు నరసరావుపేట నియోజకవర్గంలోని బసికాపురం పొలిమేరలకు చేరుకున్నారు. కావూరు గ్రామం నుండి నరసరావుపేట నియోజకవర్గంలోకి అడుగుడితున్న వరకు ఆయన వెంట వేలాదిమంది కార్యకర్తలు, అభిమానులు, నాయకులు నడిచారు. మహిళలు, యువతులు, యువకులు, వృద్ధులు కూడా ఆయనతో పాటు పాదం కలిపారు. జగన్‌కు జైజై అంటూ ద్విచక్ర వాహనాలపై యువకులు కేరింతలు మిన్నంటాయి. ఆయన పాదయాత్ర చేస్తున్నంత సేపు పూలజల్లులు కురుస్తూనే ఉన్నాయి. పాదయాత్రలో పాల్గొన్నవారికి దాహార్తిని తీర్చేందుకు ప్రత్యేక వాహనంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మంచినీటి ప్యాకెట్లు ఏర్పాటు చేశారు. తొలుత కావూరు గ్రామంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళి అర్పించిన అనంతరం ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించారు. ప్రారంభంలో అంబటి రాంబాబు, లేళ్ళ అప్పిరెడ్డి, మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల ఇన్‌చార్జి కాసు మహేష్‌రెడ్డి, వినుకొండ ఇన్‌చార్జి బొల్లా బ్రహ్మనాయుడు తదితరులు జగన్‌ను కలిసి అభివాదం చేశారు. అనంతరం ప్రారంభమైన పాదయాత్రలో జగన్‌కు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. ప్రచంచ భానుడు తన తీవ్ర రూపాన్ని ప్రదర్శించినప్పటికీ అభిమానులు ఎక్కడా వెనుకడుగువేయకపోవడం విశేషం. చిలకలూరిపేట-నరసరావుపేట రోడ్డుపై యాత్రలో పాల్గొన్న జగన్‌ను చూసేందుకు పొలాల్లో పత్తి, మిర్చి పంటల్లో కూలీలుగా పనిచేస్తున్న మహిళలు ఉరుకులు, పరుగులతో వచ్చి అభివాదం చేసి వెళ్ళారు. గంగన్నపాలెం వరకు చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలు ఆయనకు బాసటగా నిలిచారు. అనంతరం నరసరావుపేట నియోజకవర్గంలోకి ప్రవేశించిన జగన్మోహన్‌రెడ్డికి పేట ప్రజలు నీరాజనాలు అందించారు. మార్గ మధ్యంలో ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఇవ్వాలని కోరుతూ పలు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు వినతిపత్రం అందచేశారు. ఆర్‌ఎంపీ, పీఎంపీలకు గుర్తింపు ఇవ్వాలని కోరుతూ ఆ యూనియన్ నాయకులు వినతిపత్రం అందచేశారు. ఇంజనీరింగ్ విద్యార్థులు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ వినతిపత్రం అందచేశారు. ఏపీయస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ జగన్‌కు వినతిపత్రం అందచేశారు. ఎంఏఎం ఫార్మసీ కళాశాల విద్యార్థులు జగన్‌ను కలిసి అభివాదం చేశారు. అనంతరం బసికాపురం గ్రామానికి చేరుకున్న జగన్మోహన్‌రెడ్డికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. కేక్‌ను కట్ చేశారు. నెల్లూరు జిల్లా సంధ్యాపురం గ్రామానికి చెందిన డానియేల్ అనే వ్యక్తి తన ఒంటిపై వైసీపీ గుర్తు అయిన ఫ్యాన్‌ను తగిలించుకుని, దానికి ప్రత్యేకమైన బ్యాటరీ తయారు చేయించుకుని, భుజాన తగిలించుకుని, పాదయాత్ర చేస్తుంటే ప్రజలందరూ డానియేల్‌ను ఆసక్తిగా చూశారు. 11.40 గంటలకు నరసరావుపేట నియోజకవర్గంలోని కేసానుపల్లి పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గుడారంలో జగన్ విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రం మూడు గంటలకు తిరిగి ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించి, నరసరావుపేటలోని చిలకలూరిపేట బైపాస్ రోడ్డు, మల్లమ్మ సెంటర్, గాంధీ చౌక్, అంబేద్కర్ విగ్రహం మీదుగా పల్నాడు బస్టాండ్‌కు చేరుకుని, భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సభకు వేలాదిమంది కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు, నాయకులు తరలివచ్చారు.