గుంటూరు

దిగొచ్చిన అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 20: మాస్టర్‌ప్లాన్‌లో పొందుపర్చిన విధంగా రహదారికి స్థలాలు ఇస్తే తమ గ్రామంలో 80 ఇళ్లు పోతాయంటూ కృష్ణాయపాలెం వాసులు ఆందోళన చేయడంతో సిఆర్‌డిఎ అధికారులు దిగివచ్చారు. బుధవారం సిఆర్‌డిఎ అధికారులు మంగళగిరి మండలం, కృష్ణాయపాలెం గ్రామంలో మాస్టర్‌ప్లాన్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామస్థులు రహదారులకు భూములు ఇవ్వబోమంటూ ఆందోళన వ్యక్తంచేశారు. అంతేకాకుండా గ్రామంలో గల సుమారు 160 గృహాల్లో 80 ఇళ్లు రహదారి వేయడం వలన కోల్పోవాల్సి వస్తుందన్నారు. దీంతో సిఆర్‌డిఎ అధికారులు సమస్య తీవ్రతను గుర్తించి రహదారిని మార్పు చేయాలన్నారు. సిఆర్‌డిఎ అధికారులు కొంతగడువు కావాలంటూ కోరినప్పటికీ ప్రజలు ససేమిరా అన్నారు. గంటల వ్యవధిలో మాస్టర్‌ప్లాన్‌లో మార్పులుచేసి రైతులకు చూపించడంతోగ్రామం బతికిపోయిందంటూ ఊపిరి పీల్చుకున్నారు. రైతు కారుమంచి అనిల్ మాట్లాడుతూ తాము అధికారులపై ఒత్తిడి చేయడం వల్ల విజయం సాధించామంటూ హర్షం వ్యక్తంచేశారు.