గుంటూరు

అధికారంలో ఉన్నా... లేకున్నా ప్రజల సంక్షేమమే టీడీపీ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, మే 18: రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల సంక్షేమమే ధ్యే యంగా పనిచేస్తుందని మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని ఎన్‌విఆర్ కళ్యాణ మండపంలో తెనాలి నియోజకవర్గం టీడీపీ ఆధ్వర్యంలో మినీ మహానాడు సభ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర గిరిజన, సాంఘిక సంక్షేమశాఖామంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ మహానాడు అంటే కార్యకర్తల పండగగా పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం అన్న నందమూరి తారకరామారా వు కాలం నుండి కూడా అధికారంలో ఉన్నాలేకున్నా రాష్ట్ర ప్రజల సంక్షేమం, కార్యకర్తల సహకారంతో ముందుకు వెళుతూనే ఉందని పేర్కొన్నారు. విభజన సమయంలో జరిగిన 2014 ఎన్నికల్లో దొంగల చేతికి తాళాలు ఇవ్వకూడదనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రజలు టీడీపీని ఆదరించారని, నాడు ఆర్థిక లోటు వేలకోట్లలో ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో ఎక్కడా రాజీపడకుండా సీఎం చంద్రబాబు తన రాజకీయ అనుభవంతో అహర్నిశలు పనిచేస్తున్నారని చెప్పారు. రానున్న రోజుల్లోనూ ఆయనకు ప్రజలు తమ పూర్తి మద్దతు తెలుపుతూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మరోమారు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వానికి అవకాశం కల్పిస్తే భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో మొదటగా నిలబెట్టే విధంగా చంద్రబాబు తీర్చిదిద్దుతారని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ నాలుగేళ్ళ కాలంలో రాష్ట్రంలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరేవిధంగా కృషిచేసిన నాయకులు, కార్యకర్తలు ఉన్నంతవరకు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుందని జోస్యం చెప్పారు. తొలుత టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి మంత్రి, ఎమ్మెల్యే, పలువురు నాయకులు పూలమాలలువేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెండేల వెంకట్రావు, యార్డు చైర్మన్ గడవర్తి సుబ్బయ్య, టీడీపీ పట్టణ అధ్యక్షులు మహ్మద్ ఖుద్దూస్, మండల అధ్యక్షులు కావూరి చంద్రమోహన్, పార్టీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలు కాపాడుతున్న మోదీ
మంగళగరి, మే 18: దేశ ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ ప్రభుత్వం బహుళజాతి సంస్థలు, కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలను కాపాడుతోందని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ విమర్శించారు. స్థానిక సీఐటీయు కార్యాలయంలో బీ రామారావు అధ్యక్షతన శుక్రవారం జరిగిన ప్రజాసంఘాల సమావేశంలో బాలకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వరంగ సంస్థల నుంచి వేగంగా పెట్టుబడులు ఉపసంహరిస్తూ ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారని, దేశానికి తిండి పెడుతున్న రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించక పోవడం దారుణమన్నారు. దేశంలో రోజు రోజుకూ దళితులు, మైనార్టీలపై దాడులు పెరుగుతున్నాయని, గో సంరక్షణ పేరుతో ఆర్‌ఎస్‌ఎస్, భజరంగ్‌దళ్ మూకలు హత్యలు చేస్తున్నాయని, విద్యా వైద్యాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరించే విధానాల వలన మధ్య తరగతి ప్రజలు దళితులు, గిరిజనులు, మైనార్టీలు ఇబ్బందులు పడుతున్నారని బాలకృష్ణ అన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా విజయవాడలో ఈనెల 23న జరుప తలపెట్టిన ప్రదర్శన, బహిరంగ సభకు పెద్దసంఖ్యలో ప్రజలు తరలి రావాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు. వివిధ ప్రజాసంఘాల నాకులు వై కమలాకర్, టీ శ్రీనివాసరావు, పీ వెంకటేశ్వరరావు, ఎస్ కోటేశ్వరరావు, ఎం బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

కర్ణాటకలో బీజేపీ నియంతృత్వ ధోరణికి నిరసన
పొన్నూరు, మే 18: కర్ణాటక ఎన్నిక ల్లో బీజేపీ వ్యవహరిస్తున్న తీరును గర్హ్హిస్తూ అఖిలభారత కాంగ్రెస్‌పార్టీ పిలుపుమేరకు దేశవ్యాప్త నిరసనలో భాగంగా మండలంలో కాంగ్రెస్ పార్టీ నేతలు శుక్రవారం నిరసన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ నేత, కసుకర్రు సర్పంచ్ జక్కా శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు తూమాటి రమేష్, యరసాని ముసలయ్య, శ్రీహరి, ప్రదీప్ తదితరులు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనుసరించిన తీరును దుమ్మెత్తిపోశారు. అధికార దాహంతో మోదీ, అమిత్‌షా ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తూ, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. బీజేపీ నేతలు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో వ్యవహరించిన తీరు పట్ల నిరసన వ్యక్తంచేస్తూ రెవెన్యూ కార్యాలయ సూపరింటెండెంట్ మహబూబ్ సుభానికి వినతిపత్రం అందజేశారు.