గుంటూరు

రోహిత్ మృతికి కారకులను కఠినంగా శిక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జున యూనివర్సిటీ, జనవరి 21: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధక విద్యార్థి వేముల రోహిత్ చక్రవర్తి ఆత్మహత్యకు కారకులైన వారందరినీ కఠినంగా శిక్షించాలని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థి, ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. గురువారం వారు భారీ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో నేతలు మాట్లాడుతూ రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని, విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని కాపాడాలని వారు కోరారు. విద్యార్థి సం ఘాల ఘర్షణ నేపథ్యంలో కొంతమం ది విద్యార్థులకు సాంఘిక బహిష్కరణ వంటి శిక్షలు విధించటం అత్యంత అమానుషమని, హెచ్‌సియులో పాలన గాడి తప్పిందనడానికి ఇటువంటి శిక్షలే తార్కాణమని వారు ఆరోపించారు. రోహిత్ కుటుంబాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు, విశ్వవిద్యాలయం కూడా ఆదుకోవాలని కోరారు. తొలుత వర్సిటీ ప్రధాన రహదారులపై ర్యాలీ నిర్వహించిన విద్యార్థి, ఉద్యోగ సంఘ నేతలు అనంతరం వర్సిటీ రిజిస్ట్రార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ వికాస అధ్యక్షుడు టి శివన్నారాయణ, కార్యదర్శి బి రాజశేఖర్, ఎస్సీ ఉద్యోగ సంఘ నాయకులు కంకణాల సుబ్బారావు, భానుప్రసాద్, పెద్ద ఎత్తున్న విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
భూ కబ్జాకు యత్నించిన
ముఠా అరెస్ట్
గుంటూరు (క్రైం), జనవరి 21: కోటి రూపాయలకు పైగా విలువ గల ఆస్తిని స్వాహా చేసేందుకు కొందరు ముఠాగా ఏర్పడి ఆ స్థలాన్ని విక్రయించే క్రమంలో అనూహ్యంగా పోలీసులకు చిక్కిన వైనమిది. నగరంలోని ఎన్జీవో కాలనీలో ఉన్న ప్లాట్ నెంబర్ 113 యజమాని చింతిపల్లి బ్రహ్మానందమూర్తి మృతిచెందారు. అతని కుమారుడైన శ్రీరామమూర్తి విదేశాలకు వెళ్లడంతో ఈ స్థలం తాలూకు వారు ఎవ్వరూ లేరని నిర్ధారించుకున్న కొందరు రియల్ బ్రోకర్లు ఒక ముఠాగా ఏర్పడ్డారు. చంద్రశేఖర్ ఆజాద్‌రెడ్డి అనే బ్రోకర్ సదరు స్థలం తాలూకు దస్తావేజుల నకలు కాపీని సంపాదించి దీని ఆధారంగా ఈ దస్తావేజులకు అనుబంధంగా నకిలీలను సృష్టించారు. ఈ క్రమంలో వీరు చనిపోయిన స్థలం యజమాని బ్రహ్మానందమూర్తి డెత్ సర్ట్ఫికెట్, ఫ్యామిలీ మెంబర్స్ సర్ట్ఫికెట్ సైతం సంపాదించారు. ఈ క్రమంలో శ్రీరామమూర్తికి బదులుగా ప్రత్తిపాడుకు చెందిన కృష్ణారెడ్డి అనే వ్యక్తిని ప్రవేశపెట్టారు. సదరు స్థలాన్ని అమ్మకానికి పెట్టి జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలోని ఓ ఉద్యోగికి ఈ స్థలాన్ని విక్రయించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో స్థలం తాలూకు దస్తావేజులను పరిశీలనకు పంపించగా ఈ ముఠా బండారం బయటపడింది. దీంతో నగర పోలీసులు రంగప్రవేశం చేసి ముఠాకు చెందిన చంద్రశేఖర్ ఆజాద్‌రెడ్డి, రియల్టర్ ఉగ్గం శ్రీనివాస్, జ్ఞానరాజు, కృష్ణారెడ్డి, డాక్యుమెంట్ రైటర్ రవికుమార్‌లను అరెస్ట్‌చేశారు.