క్రైమ్/లీగల్

160 కేజీల గంజాయి పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదకాకాని, ఆగస్టు 24: మండల పరిధిలోని పెదకాకాని సమీపంలో గల న్యూ అమలోద్భవి హోటల్ వద్ద శుక్రవారం 160 కేజీల గంజాయి తరలిస్తున్న వాహనాన్ని పెదకాకాని పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ రామకృష్ణ మాట్లాడుతూ కృష్ణా జిల్లాకు చెందిన అడపా ఆనంద్‌కుమార్, నల్గొండ జిల్లాకు చెందిన కందుకూరి బాబు డ్రైవర్లుగా పనిచేసేవారు. చెడు వ్యసనాలకు బానిసలై అక్రమ మార్గంలో డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్న వీరు రాజమండ్రికి చెందిన హరిబాబు అనే వ్యక్తి నుండి 160 కేజీల గంజాయిని తమిళనాడు రాష్ట్రం మధురైలో ఉన్న కుమార్ అలియాస్ శరవణన్‌కు రవాణా చేస్తూ మార్గమధ్యలో పెదకాకాని పోలీసులకు పట్టుబడ్డారు. నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి గంజాయిని, వాహనాన్ని సీజ్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ శేషగిరిరావును, ఎస్‌ఐ ఆరోగ్యరాజు, హెచ్‌సి రాజేంద్రబాబు పలువురు పోలీసు సిబ్బంది అభినందించారు.

వివిధ అలంకరణలతో శోభిల్లిన అమ్మవారు
పొన్నూరు, ఆగస్టు 24: శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా పొన్నూరు ప్రాంతంలోని దేవాలయాల్లోని అమ్మవార్లు విశేష అలంకరణతో నేత్రపర్వంగా భక్తులకు దర్శనమిచ్చి ప్రత్యేక పూజలు అందుకున్నారు. పట్టణ శివారులో జీబీసీ రోడ్డు పక్కన కొలువైయున్న శ్రీ కనకదుర్గా భవాని అమ్మవారు కరెన్సీ నోట్లు, రంగురంగుల గాజుల అలంకరణతో శోభిల్లుతూ భక్తులకు దర్శనమిచ్చారు. పూజారి రామిశెట్టి గురుభవాని పర్యవేక్షణలో దుర్గా కోటినామ కుంకుమార్చనలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అతిప్రాచీనమైన సాక్షి భావన్నారాయణ స్వామి ఆలయంలోని శ్రీ రాజ్యలక్ష్మీ అమ్మవారికి నేటి ఉదయం పంచామృత స్నపన, అనంతరం విశేష పుష్పాలంకరణ, సామూహిక లక్ష్మీ అష్టోత్తర శతనామ పారాయణం జరిగాయి. సహస్రలింగేశ్వర స్వామి ఆలయంలో కొలువైయున్న పార్వతీ అమ్మవారికి శ్రీ చక్రార్చన, లలితార్చన జరిపిన దరిమిలా పూలతో విశేష అలంకరణ జరిపారు. అమ్మవారికి పూజారులు సప్త హారతులు ఇచ్చారు. శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి పుష్పాలంకరణ జరిగింది. మహిళలు సామూహిక వ్రతాలు నిర్వహించారు. పట్టణ కూడలిలో కొలువైయున్న తోటమ్మ తల్లి అమ్మవారు శాకంబరి అలంకరణలో భక్తుల పూజలు అందుకున్నారు. వివిధ రకాల ఫలాలతో అలంకరించిన అమ్మవారిని వేలాది మంది భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు.