గుంటూరు

నీట మునిగిన నగరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు సిటీ, సెప్టెంబర్ 18: నగరంలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధానంగా శివారుకాలనీలైన నందివెలుగురోడ్డు, ఆర్టీసీకాలనీ, ఇజ్రాయిల్‌పేట, పాతగుంటూరులోని అనేక ప్రాంతాల్లోని ఇళ్ళలోకి భారీగా వర్షపునీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా అరండల్‌పేట 3వ అడ్డరోడ్డులో ఇంజినీరింగ్ అధికారులు రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఇందుకోసం సుమారు నాలుగు అడుగుల వెడల్పున రోడ్డును తవ్వారు. అయితే వర్షం పడటంతో గుంటల్లోకి నీరు చేరింది. దీంతో వాహనదారులు గుంటల్లో పడటంతో తీవ్రగాయాల పాలయ్యారు. అధికారులు కనీసం ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. కనీసం సూచికలను సైతం ఏర్పాటు చేయకపోవడం శోచనీయం. ఇదే సమయంలో నల్లచెరువు, మూడు వంతెనల ప్రాంతం, ఆదిత్యనగర్, ఏటీ అగ్రహారంలోని శివారు కాలనీలు సైతం నీట మునిగాయి. ఆయా ప్రాంతాల ప్రజలు ఇళ్ళలో చేరిన నీటిని తోడిపోసేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
యూజీడీ పనులతో ప్రజలకు అష్టకష్టాలు
నగరంలో సుమారు రూ 900 కోట్లతో యూజీడీ పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం అనేక ప్రాంతాల్లో గుంటలు తవ్వారు. మంగళవారం జరిగిన భారీ వర్షం కారణంగా గుంటల్లోకి నీరు చేరింది. దీంతో వాహనదారులకు ఎక్కడ గుంటలు ఉన్నాయో తెలియక ప్రమాదాలకు గురయ్యారు. కోర్టురోడ్డు, కలెక్టరేట్‌రోడ్డు, శ్యామలానగర్‌లోని అనేక ప్రాంతాల్లో ప్రజలు ఇలా ప్రమాదాలకు గురయ్యారు. ఇదిలా ఉంటే అధికారులు దీనిపై స్పందించిన దాఖలాలు లేవు. శివారు ప్రాంతాల ప్రజలు తమ కష్టాలను తీర్చాలని మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు చేశారు. అలాగే చిరువ్యాపారులు సైతం తీవ్రంగా నష్టపోయారు. ఏది ఏమైనా నగరంలో కురిసిన భారీ వర్షంతో ప్రజలు అనేక కష్టాలు పడ్డారు.