గుంటూరు

మార్కెట్ యార్డులో సోలార్ వెలుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), సెప్టెంబర్ 18: గుంటూరు మార్కెట్ యార్డులో రానున్న రోజుల్లో సోలార్ కాంతులు నింపనున్నట్లు యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు తెలిపారు. మంగళవారం యార్డు ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో మన్నవ అధ్యక్షతన పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ యార్డులో ఏడాదికి సుమారు 3 లక్షల యూనిట్ల విద్యుత్ బిల్లు వస్తుందన్నారు. ప్రతి ఏడాదీ సుమారు కోటి రూపాయలకు పైగా విద్యుత్ ఛార్జీలకు బడ్జెట్ కేటాయిస్తున్నట్లు తెలిపారు. సోలార్ దృష్ట్యా యార్డు ప్రాంగణమంతా పచ్చదనంతో నింపాలని సూచించారు. యార్డుకు వచ్చే రైతులు, కుటుంబ సభ్యుల ప్రయోజనాల దృష్ట్యా కనీస వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు. యార్డు కార్యకలాపాలన్నింటినీ రెండు మూడు రోజుల్లో ఈ- ఆఫీస్ చేయబోతున్నట్లు చెప్పారు. 2వ నెంబర్ గేటు వద్ద త్వరలో ఎన్‌టిఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. యార్డు కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, సహాయ కార్యదర్శి సుబ్రహ్మణ్యం, వైస్ చైర్మన్ కొత్తూరి వెంకట్, డైరెక్టర్‌లు వీరయ్య, దయారత్నం, చిన్నబాజి, తాతిరెడ్డి లక్ష్మారెడ్డి, సాంబశివరావు, మన్నవ వెంకటేశ్వరరావు, ఎస్‌ఎస్‌పి జాదా, రాజీవ్ ఆనంద్, తాళ్ల నాగరాజు, బాణావత్ రాజీ తదితరులు పాల్గొన్నారు.