క్రైమ్/లీగల్

కారు ఢీకొని యువకుని మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడికొండ, అక్టోబర్ 7: మండల పరిధిలోని నిడుముక్కల గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. స్థానిక ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపిన వివరాలు ప్రకారం నిడుముక్కల గ్రామానికి చెందిన నాయుడు సురేష్ (40) స్కూటర్‌పై తాడికొండ అడ్డరోడ్డ్ సెంటర్ నుంచి నిడుముక్కల వెళ్ళుతున్నాడు, గుంటూరు నుండి అమరావతి వెళ్ళుతున్న కారు వెనుక వైపునుంచి స్కూటర్ ను బలంగా ఢీకొట్టింది, సురేష్ అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుని స్నేహితులు నెప్పళ్ల సుబ్బారావు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శవ పంచనామ నిమిత్తం మృత దేహన్ని గుంటూరు జిజిహెచ్‌కు తరలించారు. కేసు నమోదుచేసి విచారణ చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
చిలకలూరిపేట, అక్టోబర్ 7: మండల పరిధిలోని జాతీయ రహదారిపై లక్కీ రోడ్‌లైన్స్ ఎదురుగా ఒంగోలు నుండి విజయవాడ వెళ్తున్న ఇన్నోవా కారు లారీని ఓవర్‌టేక్ చేయబోయి అదుపుతప్పి 30 అడుగుల దూరంలో పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో విజయవాడ మొగల్‌రాజ్‌పురానికి చెందిన అరవపల్లి కరుణకుమార్, పోరంకికి చెందిన మురళీబాబు అక్కడికక్కడే మృతిచెందారు. వివరాల్లోకి వెళితే... విజయవాడకు చెందిన ఐదుగురు స్నేహితులు ఆదివారం సెలవుదినం కావడంతో ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం నర్సింగోలు గ్రామంలో ఉన్న శనేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించేందుకు బయలుదేరారు. వారు అనుకున్న విధంగానే ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రమాణమయ్యారు. అనుకోని విధంగా ఈ ప్రమాదం సంభవించడంతో ఇద్దరూ మృతిచెందగా, ముగ్గురు తీవ్ర గాయాలపాలై చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. రూరల్ ఎస్‌ఐ ఉదయబాబు, ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.